Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Jun-2015 17:44:38
facebook Twitter Googleplus
Photo

ఒకవైపున 'శ్రీమంతుడు' సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని, ఆ తరువాత జరగవలసిన పనుల దిశగా పరుగులు పెడుతూ వుంటే, మరో వైపున మహేష్ బాబు తదుపరి సినిమా 'బ్రహ్మోత్సవం'కు చకచకా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో కథానాయికగా సమంతా పేరు వినిపిస్తోంది. దాదాపుగా ఆమె ఖరారు అయినట్టేననీ, అధికారిక ప్రకటన మాత్రమే వెలువడవలసి వుందనే వార్తలు వినిపిస్తున్నాయి.


ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలు వుంటారనే వార్త ఆ మధ్య బయటికి వచ్చింది. నిన్న మొన్నటి వరకూ ఈ విషయంలో ఎలాంటి క్లారిటీ రాలేదు. దాంతో రకరకాల ఊహాగానాలు షికారు చేశాయి. తాజాగా అందిన సమాచారం ప్రకారం ప్రధాన కథానాయికగా సమంతాను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో జూలై 10 నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది.

,  ,  ,