Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Apr-2017 15:16:14
facebook Twitter Googleplus
Photo

ఇప్పుడు ఫిలిం ఇండస్ర్టీ చాలాసార్లు ఒకరు వదిలేసిన కథ మరొకరకి పెద్ద ప్లస్ అవుతుంది. అలాగే మైనస్ కూడా అవుతుంటుంది. సుమంత్ వదిలేసిన తొలిప్రేమ.. రవితేజ చేయని పోకిరి.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అయితే ఒక్కోసారి ఇతర హీరోలు వదిలేసిన సినిమాలు చేసి.. వేరే హీరోలు పెద్ద పెద్ద ఫ్లాపులే మూటకట్టుకున్నారు. నిప్పు.. ఊసరవెల్లి.. వంటి ఉదాహరణలు ఎన్నో.

ఇకపోతే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అత్యంత పెద్ద డిజాష్టర్ నుండి తనని తాను సేవ్ చేసుకున్నాడనే టాక్ వినిపిస్తోంది. నిజానికి ''మిష్టర్'' సినిమా కథను ముందుగా శ్రీను వైట్ల ఈ స్టార్ మెగా హీరోకే వినిపించాడు. వైట్ల డైరక్షన్లో కామెడీ చేయాలని చూసిన బన్నీకి.. ఈ కథ ఏమాత్రం నచ్చలేదు. దానితో దీనిని స్ర్టయిట్ ఎవే రిజక్టు చేసేశాడట. ఇప్పుడిక సినిమా రిజల్ట్ ఏంటనేది మనం స్వయంగా చూస్తున్నాం. నెగెటివ్ టాక్ ఎక్కువగా వచ్చేయడంతో.. భారీ ఫ్లాపు దిశగా సినిమా పయనించే ఛాన్సుంది. రికవర్ అవ్వడానికి కనీసంగా అవకాశాలు ఏవీ కనిపించట్లేదు. మొత్తానికి బన్నీ సేవ్ అయిపోయాడు.

అయితే వరుణ్ తేజ్ స్వయంగా ఏమని చెప్పాడంటే.. బన్నీ తనకు ఈ సినిమాను సజెస్ట్ చేశాడని చెప్పాడు

,  ,  ,  ,  ,  ,