Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-May-2017 12:46:08
facebook Twitter Googleplus
Photo

శేఖర్ కపూర్.. గురిందర్ చద్దా లాంటి వాళ్లు హాలీవుడ్లో సినిమాలు చేసి ఇండియన్ సినిమాకు గర్వకారణంగా నిలిచారు. మనోజ్ నైట్ శ్యామలన్ లాంటి భారత సంతతికి చెందిన దర్శకులు కూడా మనం గర్వించేలా చేశారు. ఐతే ఇండియాలోనే సినిమాలు తీస్తూ.. మధ్యలో హాలీవుడ్ సినిమాలకు సాంకేతిక సహకారం అందించిన వాళ్లు అరుదు. యూనివర్శల్ హీరో కమల్ హాసన్ ఇప్పుడు ఈ అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. ఈ ఏడాది జులైలో విడుదల కాబోతున్న హాలీవుడ్ మూవీ హీరో కు ఆయన రచనా సహకారం అందించడం విశేషం. ఈ సినిమా వికీపీడియా పేజీ చూస్తే.. అందులో రిటన్ బై కాలమ్ లో కమల్ పేరు కనిపిస్తోంది.

హీరో.. కమల్ సినిమా ఉత్తమ విలన్ కు రీమేక్ అని సమాచారం. ఆ సినిమాకు కథ.. స్క్రీన్ ప్లే అందించింది కమలే అన్న సంగతి తెలిసిందే. అందుకే రైటింగ్ క్రెడిట్ ఆయనకు ఇచ్చారట. బేసిక్ స్టోరీ ఐడియా తీసుకుని.. దానికి హాలీవుడ్ స్టయిల్లో ట్రీట్మెంట్ ఇచ్చారట. ఈ సినిమాకు ఆల్రెడీ ప్రివ్యూలు పడుతున్నాయి. రెస్పాన్స్ కూడా బాగుంది. ఉత్తమ విలన్ కమర్షియల్ గా అంత సక్సెస్ కాకపోయినప్పటికీ గొప్ప సినిమాగా పేరు తెచ్చుకుంది. కమల్ మిత్రుడు.. నటుడు రమేష్ అరవింద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించినప్పటికీ.. కమలే ఘోస్ట్ డైరెక్షన్ చేశాడంటారు. లింగుస్వామితో కలిసి కమలే స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించాడు.

,  ,  ,  ,  ,