స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ?సరైనోడు? సినిమా వేసవి కానుకగా ఏప్రిల్ 22న విడుదలకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. భోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాస్ ఎంటర్టైనర్కు సంబంధించిన ఆడియో ఈమధ్యే విడుదలై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలోనే ?సరైనోడు? టీమ్ గతవారం వైజాగ్‌లో ఓ భారీ ఆడియో సక్సెస్ మీట్‌ను కూడా నిర్వహించింది. ఇక ఈ ఆడియో ప్రస్తుతం అన్ని రేడియో స్టేషన్స్‌లో టాప్ ప్లేస్‌లో దూసుకుపోవడాన్ని ప్రత్యేకించి చెప్పుకోవాలి.
అదేవిధంగా యాపిల్ ఐట్యూన్స్ లిస్ట్‌లోనూ సరైనోడు ఆడియో కొద్దికాలంగా టాప్ ప్లేస్‌లో కొనసాగుతూ వస్తోంది. ఇదే విషయాన్ని తెలుపుతూ థమన్ తన ఆనందాన్ని వెలిబుచ్చారు. సరైనోడు ఆడియో అన్నిచోట్లా టాప్ పొజిషన్లో నిలబడడం సంతోషంగా ఉందని, సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందన్న నమ్మకం ఉందని తెలిపారు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాలో రకుల్, క్యాథరిన్ హీరోయిన్లుగా నటించారు.