Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Jul-2015 17:24:01
facebook Twitter Googleplus
Photo

ఈ రంజాన్ సీజన్ లో ఫుల్లుగా ఉపవాసాలు చేసి.. రోజు చివరిలో హలీమ్ ఇతరత్రా మాంసాహారాలు పుచ్చుకున్నాం కదా! అయితే ఇలా చేయడం వల్ల కొన్నిరకాల టాక్సిన్స్ ఫామ్ అవుతాయని 'వెజిటేరియన్'లు చెబుతున్నారు. అంతేకాదండోయ్.. రకరకాల మాంసకృతులు తేలిగ్గా డైజెస్ట్ కాని పదార్థాలు తిన్నప్పుడు అవన్నీ శరీరంలో విషతుల్యం అవుతాయి. వాటన్నిటినీ క్లియర్ చేయాలంటే కొన్ని చిట్కాలు నా దగ్గరు ఉన్నాయి. వినండి ప్లీజ్.. అని చెబుతున్నాడు అల్లు శిరీష్.

అంతేకాదు ఈ రంజాన్ సీజన్ లో హలీమ్ తినలేకపోయినందుకు కాస్త బాదగానే ఉన్నా.. 21రోజులు ఎంతో నిష్ఠతో వెజిటేరియన్ ఫుడ్ తింటూ డిటాక్సేషన్ చేశానని చెబుతున్నాడు. ఓ క్రమపద్ధతిలో ప్రొటీన్ డైట్ తీసుకుంటే తప్పేం లేదు. మాంసాహారం పూర్తిగా వదిలేసి వెజిటేరియన్ గా ఉండడం వల్ల కొంతవరకూ శరీరంలో విషాల్ని బైటికి పంపించేయగలం. అలాగే అసలు ఏదీ చేయలేని వాళ్లు వారాంతంలో ఉపవాసం చేయడం ద్వారా కొంతవరకూ శరీరంలో సిస్టమ్ ని మార్చవచ్చు. కొంత నష్టాన్ని నివారించవచ్చు. ఇదంతా నేను చెప్పడం లేదు. ప్రముఖ డాక్టర్లు ఆహార నిపుణులు చెబుతున్నారని శిరీష్ చెప్పాడు. అదీ సంగతి.

,  ,  ,