Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Feb-2017 11:49:56
facebook Twitter Googleplus
Photo

అన్నయ్య మంచు విష్ణు లాగే.. తమ్ముడు మంచు మనోజ్ కూడా లవ్ మ్యారేజే చేసుకున్నాడు. తమ కామన్ ఫ్రెండు ద్వారా కలిసిన ప్రణతితో ప్రేమలో పడి.. ఆమెనే పెళ్లి చేసుకున్నాడు. ఇరు కుటుంబాలు కూడా అభ్యంతరం చెప్పలేదు. ఐతే పెళ్లికి ముందు మనోజ్.. తన భార్యకు ఒక కండిషన్ పెట్టాడట. దానికి ఓకే అన్నాకే ఆమెను పెళ్లాడాడట. ఆ కండిషన్ ఏంటో మనోజ్ మాటల్లోనే తెలుసుకుందాం పదండి.

నా భార్య నాకు మంచి స్నేహితురాలు. ఆమెతో పెళ్లికి ముందే ఒక మాటచెప్పాను. నేను ఆర్టిస్టుని. డబ్బు దాచుకోవడం రాదు. ఇంట్లో డబ్బు అడగను. పరిస్థితులు బాలేకపోతే ఒకరి ముందు చెయ్యి చాచడం నాకు అలవాటు లేదు. భవిష్యత్తులో చిన్న అపార్టుమెంటుకో.. గుడిసెకో వెళ్లాలంటే నాతో పాటు వచ్చేయాలి అన్నాను. అందుకు ఆమె అంగీకరించి.. ఎక్కడికైనా వస్తానని ఆమె నాతో ఏడడుగులు వేసింది అని మనోజ్ చెప్పాడు.

తాను ఏ సినిమాలు చేస్తున్నాను.. ఎంత సంపాదిస్తున్నాను అన్నది తన భార్య ఎప్పుడూ అడగదని.. ఆమెకు సినిమాలంటే ఇష్టమని.. తాను చేసే సినిమాల్లో ఏదైనా సీన్ ఓవర్ గా అనిపిస్తే మొహమాటం లేకుండా చెప్పేస్తుందని... అప్పుడప్పుడూ కొన్ని సలహాలు ఇస్తుంటుందని మనోజ్ తెలిపాడు

,  ,  ,  ,  ,  ,  ,