Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Jul-2016 15:42:50
facebook Twitter Googleplus
Photo

హైదరాబాద్: ఇరవై మూడేళ్ల కెరీర్‌... వేల కార్యక్రమాలూ, ధారావాహికలూ... ఇలా యాంకర్‌ సుమ గురించి చెప్పడం మొదలు పెడితే చిట్టా చాలా పెద్దదే! ఆ ప్రస్థానంలో హాస్యాన్నీ, నటననూ కలగలిపిన యాంకరింగ్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకుంది. అవార్డుల కంటే ఎంతో విలువైన ప్రముఖుల ప్రశంసలతో పాటూ, ప్రేక్షకుల అభిమానాన్నీ సంపాదించుకుంది సుమ. తెలుగులో తిరుగులేని యాంకర్ గా దూసుకెలుతున్న సుమపై అప్పట్లో షాకింగ్ రూమర్స్ వినిపించిన సంగతి తెలిసిందే. యాంకరింగ్ అంటేనే చాకచక్యంగా మాట్లాడటం మాత్రమే కాదు...కొన్ని సార్లు అందరికీ వినిపించేలా అరవడం కూడా. ఇలా వేలాది కార్యక్రమాల్లో అరిచీ అరిచీ సుమ గొంతు మూగబోయే పరిస్థితి ఏర్పడిందని అప్పట్లో రూమర్స్ హల్ చల్ చేసాయి. యాంకరింగ్ ఇలానే కొనసాగిస్తే సుమ మరింత ఇబ్బందుల్లో పడుతుందని, పర్మినెంటుగా వాయిస్ క్రాక్ అయ్యే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరించినట్లు అప్పట్లో వార్తలు రావడంతో ఆమె అభిమానులంతా కంగరు పడ్డారు. అయితే అవన్నీ రూమర్సే అని తేలింది. ఏదో చిన్న గొంతు సమస్యతో సుమ డాక్టర్ దగ్గరికి వెళితే....దాన్ని మరోలా ప్రచారం చేసారు. ఈ విషయమై సుమ కూడా స్పందిస్తూ నా గొంతుకు ఏమీ కాలేదని వివరణ ఇచ్చారు.

,  ,  ,  ,  ,