Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Oct-2017 10:47:39
facebook Twitter Googleplus
Photo

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సాహో చిత్రం పై ప్రేక్షకులకు భారీ అంచనాలున్నాయి. సాహో సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ కు మంచి క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ టీజర్ లో ప్రభాస్ కంప్లీట్ గా డిఫరెంట్ లుక్ తో కనిపించాడు. హాలీవుడ్ మూవీ తరహాలో సుజీత్ సాహోను తెరకెక్కిస్తున్నాడు. మొదట విడుదల చేసిన టీజర్ తర్వాత సాహో షూటింగ్ గురించిన ఎటువంటి విషయాలు బయటకు రాలేదు. ఈ నేపథ్యంలో ప్రభాస్ బర్త్ డే రోజున ఫ్యాన్స్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట.

ఈ నెల 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సాహో మేకింగ్ టీజర్ ను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంతకముందు కూడా బాహుబలి .. బాహుబలి 2 షూటింగ్ సమయంలో ఇదే విధంగా ఫ్యాన్స్ ను ప్రభాస్ సర్ ప్రైజ్ చేశాడు. ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఆ సినిమాలకు సంబంధించిన స్పెషల్ కంటెంట్ ను అభిమానులకు అందించాడు. అదే ఫార్ములాను ఈ సారి కూడా ప్రభాస్ ఫాలో కాబోతున్నాడని టాలీవుడ్ టాక్. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 2018 సమ్మర్ రేస్ లో సాహోను నిలిపేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది. బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ ..ప్రభాస్ కు జోడీగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

,  ,  ,  ,  ,