Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Apr-2016 18:22:06
facebook Twitter Googleplus
Photo

మెగాస్టార్ చిరంజీవి కమ్ బ్యాక్ మూవీకి ముహూర్తం దగ్గరవుతోంది. తన 150వ సినిమాగా కోలీవుడ్ మూవీ కత్తి రీమేక్ ని ఎంచుకున్న మెగాస్టార్.. ఏప్రిల్ 29 మధ్యాహ్నం 1.30కి ముహూర్తం షాట్ తో సినిమా ప్రారంభించనున్నారు. రెగ్యులర్ షూటింగ్ మొదలవడానికి మరో నెల రోజుల సమయం ఉన్నా.. ఇప్పుడు మాత్రం అభిమానుల దృష్టంతా.. చిరు మహూర్తం షాట్ పైనే ఉంది.

హైద్రాబాద్ జూబిలీ హిల్స్ చెక్ పోస్ట్ సమీపంలో చిరు నివాసం గతంలో ఉండేవారు. ఇప్పుడదే ఇంటిని తన మూవీకి ఆఫీస్ గా మార్చేసుకున్నారు మెగాస్టార్. చిరంజీవి ఆ ఇంట్లో ఉన్న సమయంలో బోలెడన్ని హిట్స్ సాధించడంతో.. అది తన లక్కీ హౌజ్ గా భావిస్తారాయన. చిరు తర్వాత అల్లు అరవింద్ ఆ ఇంట్లో ఉండేవారు. ఆయనకు కూడా ఇది లక్కీ హౌజ్ అయింది. అందుకే ఇప్పుడదే ఇంటిని కొణిదెల ప్రొడక్షన్స్ కు ఆఫీస్ గా మార్చుకున్నారు చిరు ఫ్యామిలీ. ముహూర్తం షాట్ కి వచ్చేందుకు మెగా ఫ్యాన్స్ భారీ ఏర్పాట్లు చేసుకుంటూ ఉండడంతో.. అలాంటి ఆర్భాటాలు వద్దంటూ చిరు అభిమానులకు సూచించారు.

ఈ కార్యక్రమం సింపుల్ గా ఉంటుందని. మీడియాకు కూడా చెప్పేశారు. ఎండాకాలం కావడం మధ్యాహ్నం ముహూర్తం ఉండడంతో.. భారీ సంఖ్యలో అభిమానులు వస్తే వారు ఇబ్బందులు పడాల్సి ఉంటుందనే ఈ డెసిషన్ అంటున్నారు. మొత్తానికి చిరంజీవి భార్య సురేఖ- రామ్ చరణ్ లు నిర్మాతలుగా మొదటి సినిమా చాలా సింపుల్ గా స్టార్ట్ కానుంది.

,  ,  ,  ,  ,