Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

31-Jan-2017 10:11:44
facebook Twitter Googleplus
Photo

పుష్కర కాలం నుంచి సక్సెస్ కోసం దండయాత్ర చేస్తున్నాడు ఒకప్పటి స్టార్ డైరెక్టర్ తేజ. కానీ ఆయన ప్రయత్నం ఫలించడం లేదు. తేజ సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి ఫ్లాపవుతున్నాయి. చివరగా ఆయన తీసిన హోరాహోరీ గురించి చాలా చెప్పాడు కానీ.. ఆ సినిమా కూడా అట్టర్ ఫ్లాపుల జాబితాలో చేరిపోయింది. ఆయన ట్రాక్ రికార్డు చూసి రానా లాంటి క్రేజీ హీరో సినిమా చేయడానికి ముందుకు రావడం.. సురేష్ బాబు లాంటి అగ్ర నిర్మాత సినిమాను నిర్మించడం విశేషమే. ఈ ముగ్గురి కాంబినేషన్లో రాబోతున్న సినిమానే.. నేనే రాజు నేనే మంత్రి. కాజల్ కథానాయికగా నటిస్తోంది ఇందులో.

ఈ మధ్యే ఈ సినిమాకు సంబంధించి రానా రోడ్డు మీద ర్యాలీగా వెళ్తున్న ఫొటో ఒకటి బయటికి వచ్చింది. నేనే రాజు నేనే మంత్రి అన్న టైటిల్.. ఈ ఫొటో చూస్తే ఇది పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమా అని అర్థమైపోయింది. స్వయంగా రానానే ఈ విషయాన్ని కన్ఫమ్ చేశాడు. తాను ఈ చిత్రంలో యువ రాజకీయ నాయకుడి పాత్ర చేస్తున్నట్లు తెలిపాడు. ఐతే తన తొలి సినిమా ?లీడర్?తో పోలిస్తే ఈ పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుందని రానా చెప్పాడు. అనంతపురం నేపథ్యంలో ఈ కథ సాగుతుందని రానా వెల్లడించాడు. ఇది ఒక రకంగా బయోపిక్ తరహా సినిమా అని.. కాకపోతే కథంతా కల్పితమేనని.. ఎవరినీ ఉద్దేశించింది కాదని చెప్పాడు. సమకాలీన రాజకీయాల ప్రస్తావన ఈ సినిమాలో ఉంటుందన్నాడు. రానా చెబుతున్న మాటలు సినిమా మీద ఆసక్తి రేకెత్తించేవే. మరి తేజ ఏదైనా యువ నాయకుడిని దృష్టిలో ఉంచుకుని ఈ సినిమా తీశాడేమో చూడాలి.

,  ,  ,  ,  ,  ,