Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Mar-2017 13:46:30
facebook Twitter Googleplus
Photo

రాజ్ తరుణ్ చాలా యారొగెంట్.. అతడికి అనిల్ సుంకరతో కాంట్రాక్టు ఉంది. అనిల్ అతడికి విల్లా గిఫ్టిచ్చాడు.. రాజ్ తరుణ్ కు యాంకర్ లాస్యను పెళ్లి చేసుకోబోతున్నాడు.. ఇలా గత కొన్ని నెలల్లో రాజ్ తరుణ్ గురించి రకరకాల ప్రచారాలు జరిగాయి మీడియాలో. వాటన్నింటి మీదా ఒక ఇంటర్వ్యూ స్పందించాడు రాజ్ తరుణ్. తన గురించి జరిగినవన్నీ దుష్ప్రచారాలే అని చెబుతూ.. ఇందులో ఒక్కో విషయానికీ వివరణ ఇచ్చాడు. ఇంతకీ అతనేమంటున్నాడంటే..

ఆ మధ్య ఒక సినిమా ప్రి రిలీజ్ ప్రమోషన్లలో భాగంగా మీడియా వాళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వాల్సి ఉంది. ఐతే కొన్ని కారణాల వల్ల చాలా లేటుగా వెళ్లాను. అలా ఆలస్యంగా వెళ్లడం నా చేతుల్లో లేదు. ఐతే మీడియా వాళ్లు అప్పట్నుంచి నాపై యారొగెంట్ అని ముద్ర వేసేశారు. అలా బ్యాడైపోయాను. నాకు అనిల్ సుంకర గారితో ఎలాంటి కాంట్రాక్టూ లేదు. ఏదో కలిసొచ్చి ఆయనతో వరుసగా సినిమాలు చేస్తున్నా. ఈడోరకం ఆడోరకం.. కిట్టు ఉన్నాడు జాగ్రత్త ఆయన బేనర్లో చేసినవే. ‘అంధగాడు’ కూడా ఆయనతోనే చేస్తున్నా. మా మధ్య కాంట్రాక్టులేమీ లేవు. అది జస్ట్ రూమరే. ఇక అనిల్ గారు.. దిల్ రాజు గారు కలిసి నాకు విల్లా కట్టించినట్లు కూడా న్యూస్ వచ్చింది. నాకు విల్లా కొనాలన్నది ఎప్పట్నుంచో ఉన్న ఆశ. దాన్ని నెరవేర్చుకున్నా. దాన్ని నేనే కొన్నా. అంతకుమించి ఏమీ లేదు. లాస్యతో అసలెందుకు ముడిపెట్టారో అర్థం కాదు

,  ,  ,  ,  ,