ప్రముఖ నటుడు సునీల్ దత్ పాత్రలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కనిపించనున్నారు. సంజయ్ దత్ జీవితం ఆధారంగా 'పీకే' ఫేం రాజ్ కుమార్ హిరానీ ఓ చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేసుకుంటున్న సంగతి విదితమే. ఇందులో సంజయ్ దత్ గా రొమాంటిక్ హీరో రణబీర్ కపూర్ నటిస్తాడు. ఇక సంజయ్ తండ్రి సునీల్ దత్ గా అమితాబ్ ను అడిగినట్టూ, అందుకు ఆయన అంగీకరించినట్టూ బాలీవుడ్ న్యూస్. అమితాబ్ అంటే సంజయ్ కు ఎంతో గౌరవమనీ, ఆయనను తన తండ్రిగా భావిస్తారనీ, అందుకే ఆ పాత్రను బిగ్ బీ చేత వేయించాలని ప్రయత్నిస్తున్నారనీ అంటున్నారు.
sanjaydutt, amitabhbachan, ranbirkapoor,