Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Sep-2017 11:38:50
facebook Twitter Googleplus
Photo

సమంత తెలుగు - తమిళ్ భాషల్లో టాప్ హీరోయిన్ మాత్రమే కాదు. తెలంగాణ రాష్ట్రానికి చేనేత బ్రాండ్ అంబాసిడర్ కూడా. బ్రాండ్ అంబాసిడర్ అంటే ఏదో హోదా అని వదిలేయకుండా చేనేతకు పేరు తెచ్చేందుకు మొదటి నుంచి సిన్సియర్ గా ట్రై చేస్తోంది. హీరోయిన్ గా ఫ్యాషన్ షోలకు వెళ్లినప్పుడు చేనేత వస్త్రాలే ధరించి వాటి గ్లామర్ ను ప్రపంచానికి చాటి చెప్పింది.

రీసెంట్ గా సిద్ధిపేట జిల్లాలోని దుబ్బాక చేనేత సహకార సంఘాన్ని సందర్శించింది. అక్కడ నేత కార్మికులు నేస్తున్న వస్త్రాలను పరిశీలించింది. వాటి గొప్పతనాన్ని మెచ్చుకుంటూనే ఇప్పటి తరానికి ఎలాంటి డిజైన్లు నచ్చుతాయో అలాంటివి తయారు చేయకపోవడం వల్లనే యంగ్ పీపుల్ చేనేతను దూరంగా ఉంచుతున్నారని చెప్పుకొచ్చింది. ఈ కార్మికుల్లో మంచి నైపుణ్యం ఉన్నా దుస్తులన్నీ ఓల్డ్ లుక్ లో ఉంటున్నాయని స్పష్టంగా చెప్పింది. అందుకే లేటెస్ట్ ట్రెండ్ కు తగ్గట్టుగా దుస్తులు డిజైన్ చేసేలా నేత కార్మికులకు ట్రైనింగ్ ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరతానంది. ఇతర దేశాల్లో చేనేతకు ఆదరణ ఉన్నా ఎక్స్ పోర్ట్ చేయలేకపోవడానికి ఇవే కారణాలని క్లారిటీ ఇచ్చింది. చేనేత వస్త్రాల తయారీ మానుకుని చాలామంది ఇతర రంగాలకు వెళ్లిపోయారని... చేనేతకు ఆదరణ పెరిగితే తిరిగి వారు వెనక్కి వస్తారని అంటోంది.

అక్టోబర్ లో గోవాలో నాగచైతన్యతో సమంత పెళ్లి జరగనుంది. పెళ్లి ఏర్పాట్లు వాళ్లిద్దరే దగ్గరుండి చూసుకుంటున్నారని నటుడు నాగార్జున ఆల్రెడీ చెప్పాడు. దాంతో పాటు పెళ్లికి ముందే వీలైనంత వరకు షూటింగులు పూర్తి చేయాలని సమంత చాలా శ్రమిస్తోంది.

,  ,  ,  ,  ,