Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Mar-2016 14:26:54
facebook Twitter Googleplus
Photo

అక్ష‌య్ ప్ర‌త్యూష ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై జి.ముర‌ళిప్ర‌సాద్ ద‌ర్శ‌క‌త్వంలో రామ‌చంద్ర‌, అశాల‌త హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం అమ్మాయి ఆరుగురు. వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించిన ఈ సినిమా పాట‌ల విడుద‌ల కార్య‌క్ర‌మం శనివారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. బెక్కం వేణుగోపాల్ ఆడియో సీడీల‌ను విడుద‌ల చేయ‌గా తొలి సీడీని డిజిక్వెస్ట్ బ‌సిరెడ్డి అందుకున్నారు. ఈ సంద‌ర్బంగా...
బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ ``కొత్త‌వారికి నా బ్యాన‌ర్లో అవ‌కాశాలు ఇస్తుంటాను. ఇప్పుడు అలా ప‌రిచ‌యం చేసిన చాలా మంది మంచి పోజిష‌న్స్‌లో ఉన్నారు. ఈ సినిమా ద‌ర్శ‌కుడు ముర‌ళి నాకు చాలా కాలంగా ప‌రిచ‌యం ఉంది. అంద‌రి ద‌గ్గ‌ర ప‌నిని రాబ‌ట్టుకునే విధానం త‌న‌కు బాగా తెలుసు. సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను?? అన్నారు.
డిజిక్వెస్ట్ బసిరెడ్డి మాట్లాడుతూ ??మురళితో చాలా కాలంగా మంచి అనుబంధం ఉంది. మంచి ప్రతిభావంతుడు. ఓ మంచి ప్రయత్నం చేశారు. మంచి మ్యూజిక్, పాటలు బావున్నాయి. నిర్మాత రామచంద్రగారికి ఈ సినిమా మంచి పేరు, డబ్బులు తీసుకురావాలి. సినిమా పెద్ద హిట్ కావాలి?? అన్నారు.
దర్శకుడు జి.మురళిప్రసాద్ మాట్లాడుతూ ??ఇది నా మూడో సినిమా. అందరి మిత్రుల సహకారంతో సినిమాను అనుకున్న సమయంలోనే పూర్తి చేశాను. బసిరెడ్డిగారి సపోర్ట్ మరచిపోలేను. వందేమాతరం శ్రీనివాస్ గారు మంచి మ్యూజిక్ అందించారు. మంచి హర్రర్ కాన్సెప్ట్ మూవీ. ఆరుగురు డబ్బున్న అబ్బాయిలు ఓ జంటను చంపేస్తారు. ఆ జంటలో అమ్మాయి దెయ్యంగా మారి ఆరుగురు యువకులపై ఎలా ప్రతీకారం తీర్చుకునిందనేదే కథ. త్వరలోనే సినిమాను మీ ముందుకు తీసుకువస్తున్నాం. మా ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని భావిస్తున్నాను?? అన్నారు.
ఈ కార్యక్రమంలో చిత్రయూనిట్ సభ్యులు,లయన్ సాయివెంకట్, ఏపీ సివిల్ సప్లై ఛైర్మన్ మల్లెల లింగారెడ్డి, సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.
జూ.రేలంగి, రవి, మాస్టర్ అక్షయ్, జబర్ దస్త్ రాము, శ్రీనివాసరెడ్డి, రసూల్, యన్.యమ్.నజీర్, శేఖర్ బాబు, మునీంద్ర, అంజలి, శోభ, చంద్రమౌళి, కౌశిక్, కామాక్షి, పూనమ్ తదితరులు ఇతర తారాగణంగా నటించిన ఈ చిత్రానికి కథ-అక్షయ్ ప్రత్యూష ఎంటర్ టైన్మెంట్స్, మాటలు- సాయికుమార్ రెడ్డి, కెమెరా- వడ్డేల్లి సుధీర్, ఎడిటర్- నందమూరి హరి, సంగీతం- వందేమాతరం శ్రీనివాస్, ఆర్ట్ ? వెంకటేష్, నిర్మాత, పర్యవేక్షణ ? రామచంద్ర దోసపాటి, దర్శకత్వం ? జి.మురళిప్రసాద్.

,  ,  ,  ,