Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-May-2016 11:51:32
facebook Twitter Googleplus
Photo

ఇప్పుడు మన డిస్ర్టిబ్యూటర్లు అందరూ.. అసలు ఒక స్టార్ సినిమా తొలి రోజు కలక్షన్లు ఎందుకు ఎఫెక్టు అవుతున్నాయ్ అనే విషయంపై ఫోకస్ చేయడం మొదలెట్టారు. వారు తెలుసుకుంది ఏంటంటే.. ఈ ఓవర్సీస్ స్ర్కీనింగుల ద్వారా పెద్ద నష్టం జరుగుతోందని.. వాటిని కాస్త చెక్ లో పెట్టకపోతే.. ఇక్కడి కలక్షన్లు దెబ్బతింటున్నాయని ఒక అవాగాహనకు వచ్చారట.

''బ్రహ్మోత్సవం'' సినిమాకు అసలు ఎక్కడా మన తెలుగు రాష్ట్రాలలో బెనిఫిట్ షో అనేదే పడ్లేదు. అయితే ఉదయం 5.30కే.. సినిమా బాగాలేదంట.. యావరేజ్ అంట.. సెకండాఫ్ బోర్ అంట.. అనే టాక్ వచ్చేసింది. అది కూడా ఎన్నో మారుమూల టౌన్స్ నుండి అభిమానులు ఇలాంటి కామెంట్లు చేశారు. దీనంతటికీ కారణం.. అమెరికాలో వేసిన ప్రీమియర్ షోలే. అక్కడ ప్రీమియర్ షో చూస్తే.. చాలామంది కొన్ని వెబ్ సైట్లలో లైవ్ ట్వీట్స్.. మిని రివ్యూస్ అంటూ పెట్టేస్తున్నారు. కొంతమంది ట్విటర్ - ఫేస్ బుక్కులో తమ ఫీలింగ్ రాసేస్తున్నారు. ఇక్కడ సినిమాలు చూసేవారు అవన్నీ ఫాలో అయ్యి.. సినిమాకు వెళ్ళాలా లేదా అనే ఆలోచనలు చేస్తున్నారు. మన దగ్గర పొద్దున్నే 11 గంటలకు మార్నింగ్ షో మొదలయ్యేలోపే బ్రహ్మోత్సవం టాక్ ను స్ర్పెడ్ చేశారు. దాని కారణంగా ఓపెనింగ్స్ పై ప్రభావంతో పాటు.. మరుసటి రోజుల్లో కూడా ఈ టాక్ విపరీతంగా సోషల్ నెట్వర్క్ లో ప్రచారమైపోయి.. ఓవరాల్ గా ఇండియాలో కలక్షన్లకు దెబ్బేస్తోంది.

ఇక అమెరికాలో ప్రీమియర్ షో ల కారణంగా.. మహేష్ వంటి స్టార్ సినిమాలకు డబ్బులు ఎక్కువొస్తాయి. ఎందుకంటే సాధారణంగా 8 డాలర్లు ఉండే మూవీ టిక్కెట్.. ఈ ప్రీమియర్లలో 25 డాలర్లు పెడతారు. అంటే మూడు రెట్లు డబ్బులు ఒకేసారి వసూలు చేసుకుంటున్నారనమాట. కాని ఇక్కడొచ్చే డాలర్ల గురించి చూసుకుంటే.. మరి ఇండియాలో మొత్తానికే నష్టం వచ్చేస్తోంది.

,  ,  ,  ,  ,  ,