Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-Apr-2016 15:46:21
facebook Twitter Googleplus
Photo

మాటలతో మ్యాజిక్ చేసే దర్శకుడు త్రివిక్రమ్, లవర్ బాయ్ నితిన్, స్టార్ హీరోయిన్ సమంతల క్రేజీ కాంబినేషన్‌లో ?అ..ఆ..? పేరుతో ఓ సినిమా విడుదలకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. ?అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి? అనే ఆసక్తికర ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్‌తోనే విపరీతమైన అంచనాలను రేకెత్తించింది. ఇక ఈ టీజర్‌కు వచ్చిన రెస్పాన్స్‌తో హ్యాపీ అయిన టీమ్ ఆ వెంటనే ఆడియో రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించేసి అభిమానుల్లో ఉత్సాహం నింపింది.
కాగా ఈనెల 26న (నేడు) ఆడియో రిలీజ్ జరపనున్నట్లు వారం క్రితమే ప్రకటించిన టీమ్, ఆ తర్వాత ఆడియో రిలీజ్ ప్రస్తావనే తీసుకురావడం మానేసింది. ఇప్పటికీ ఈ విషయమై ప్రకటనేదీ రాకపోవడంతో నేడు ఆడియో రిలీజ్ లేదన్న విషయం స్పష్టం అయిపోయింది. అయితే ఇలా ఆడియో రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు గానీ, కొత్త రిలీజ్ డేట్‌ను గానీ ప్రకటించకపోవడంతో ?అ..ఆ..? సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు అయోమయంలో పడిపోయారు. ప్రస్తుతానికి దర్శక, నిర్మాతలు ఓ కొత్త ఆడియో డేట్ కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చారు. మే నెలలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

,  ,  ,  ,  ,  ,  ,