Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Oct-2015 14:21:00
facebook Twitter Googleplus
Photo

రకూల్ - రాశిఖన్నా - రెజీన - అనుపమ పరమేశ్వరన్.. ఇలా ఏవో కొన్ని పేర్లు మాత్రమే టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. అయితే వీళ్లందరికీ అనూహ్యంగా పోటీ ఇచ్చేందుకు తెరపైకి దూసుకొస్తోంది ముంబై మోడల్ అమైరా దస్తూర్. ఈ అమ్మడి పేరు అప్పుడప్పుడు టాలీవుడ్ లో వినిపిస్తూ ఉన్నా ఒక్క ప్రాజెక్టు కూడా కన్ఫమ్ అయ్యిందే లేదు. అయితే ఇప్పటికిప్పుడు ఈ ముద్దుగుమ్మ వరుసగా సెట్స్ కెళ్లడానికి రెడీ అవుతున్న క్రేజీ ప్రాజెక్టులన్నిటిలో ఓ ఆప్షన్ అయ్యింది.

ఇప్పటికే కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ సరసన నటించేందుకు రెడీ అవుతోంది. మేకర్స్ తో మంతనాలు సాగించేసింది. అలాగే రామ్ చరణ్ సరసన తని ఒరువన్ రీమేక్ లో నటించేందుకు మాటలు జరుగుతున్నాయి. ఇదేగాక యంగ్ హీరో నాగచైతన్య సరసన ప్రేమమ్ రీమేక్ మజ్నులో నటించేందుకు రెడీ అవుతోంది. రవితేజ - వేణు శ్రీరామ్ - దిల్రాజు కాంబినేషన్ లోని ఎవడో ఒక్కడు చిత్రంలోనూ నటించేందుకు స్కెచ్ వేసింది. ఇంతమందితో ఈ అమ్మడు తెలివిగా మంతనాలు సాగిస్తోంది. ఇవన్నీ తన కెరీర్ లో ఉంటే నెక్స్ట్ జనరేషన్ హీరోయిన్ గా అమైరా దస్తూర్ పాపులర్ అవ్వడం ఖాయం.

,  ,  ,  ,