Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Dec-2014 11:27:36
facebook Twitter Googleplus
Photo

ఎన్నో ఆఫర్లు వచ్చినా ఒప్పుకోని హాట్ తెలుగు యాంకర్ అనసూయ ఇటీవలే ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం విదితమే. అడవి శేష్ హీరోగా నూతన దర్శకుడు రవికాంత్ దర్శకత్వంలో రూపొందే సినిమాలో కథానాయికగా నటించడానికి ఈ చిన్నది సంతకం చేసింది. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందే ఈ చిత్రానికి 'క్షణం' అనే టైటిల్ని ఖరారు చేసినట్టు సమాచారం. పీవీపీ సంస్థ నిర్మించే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ సినిమాలో కొత్త అనసూయను చూస్తారంటూ చెప్పిన ఈ హాట్ సుందరి, తాజాగా హెయిర్ స్టయిల్ మార్చి తన రూపురేఖల్ని మార్చేసుకుంది. ఈ సినిమా కోసం ఆమె భారీ మొత్తంలో పారితోషికం తీసుకుంటోంది.

,  ,  ,  ,  ,