Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-May-2016 15:32:23
facebook Twitter Googleplus
Photo

ఈ మధ్య హీరో హీరోయిన్ల పారితోషకాలు బాగా పెరిగిన మాట వాస్తవమే. కానీ అనసూయను హీరోయిన్గా ఎవరు ట్రీట్ చేస్తారు..? ఆమె చిన్న రోల్ చేసిన ?సోగ్గాడే చిన్నినాయనా? బ్లాక్ బస్టర్ హిట్టయినా.. కీలకమైన పాత్ర చేసిన ?క్షణం? సూపర్ హిట్టయినా.. అనసూయను ఓ హీరోయిన్ లాగా ట్రీట్ చేసే పరిస్థితి లేదు. కానీ ఆమె మాత్రం చేతిలో రెండు హిట్లు ఉన్నాయని చెప్పుకుంటూ ఏకంగా రూ.40 లక్షల పారితోషకం డిమాండ్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ జనాలు చెప్పుకుంటున్నారు. ఈమెతో పోలిస్తే రెగ్యులర్ హీరోయిన్లు నయం కదా అని అనసూయ జోలికే వెళ్లట్లేదట టాలీవుడ్ నిర్మాతలు.

అనసూయ డిమాండ్ చేస్తున్నదంతో సగం పెడితే కాస్త పేరున్న రెగ్యులర్ హీరోయిన్లే ఓకే అంటుండటంతో ఆమెకు టాటా చెప్పేస్తున్నారట. అనసూయకు ఎంత మంచి పాపులారిటీ ఉన్నప్పటికీ ఆమె హీరోయిన్ వేషాలకు పనికి రాదు. ఆమె ఆ వయసు ఎప్పుడో దాటిపోయింది. పైగా ఇద్దరు పిల్లల తల్లి అయిన అనసూయకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. రష్మిలాగా గ్లామర్ రోల్స్ చేయలేదు.

ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని.. ఆమె డిమాండ్ చేస్తున్న పారితోషకం టూమచ్ గా అనిపించి అవకాశాలు ఇవ్వట్లేదట నిర్మాతలు. అందుకే రెండు సూపర్ హిట్ సినిమాలతో లక్కీ హ్యాండ్ గా ముద్రపడ్డా.. చేతిలో ఒక్క ఛాన్స్ కూడా లేదట అనసూయకు.

,  ,  ,  ,  ,