Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Nov-2016 11:02:34
facebook Twitter Googleplus
Photo

మన జనాలు సినిమాల్లోని స్పెషల్ సాంగ్స్ని ఐటెమ్స్ అనే పిలుస్తారు. అందులో ఆడిపాడే భామల్ని ఐటెమ్ గాళ్స్ అనడం కూడా కద్దు. ఇదివరకు ఆ పాటల్లో నటించే స్పెషలిస్ట్ భామలు చాలామందే కనిపించేవాళ్లు. ఈమధ్య హీరోయిన్లే ఐటెమ్ పాటల్లో ఆడిపాడుతున్నారు కాబట్టి సో కాల్డ్ ఐటమ్ భామలు కనుమరుగైపోయారు. అయితే ఎప్పుడైతే హీరోయిన్లు ఐటెమ్ పాటలు చేయడం మొదలుపెట్టారో అప్పట్నుంచి ఆ పాటల రేంజ్ బాగా పెరిగింది. లక్షల్లో ఉన్న వాటి కాస్ట్ కోట్ల రూపాయలకి చేరింది. ఐటెమ్ కాస్త స్పెషల్ సాంగ్ రూపు సంతరించుకుంది.

హీరోయిన్లు కూడా ఐటెమ్ పాట - ఐటెమ్ గాళ్ అని పిలిస్తే ఈసడించుకోవడం మొదలుపెట్టారు. దాన్ని స్పెషల్ సాంగ్ అనే పిలవమని కోరుతున్నారు. విన్నర్ లో స్పెషల్ సాంగ్ చేసిన అనసూయ కూడా ఆన్ లైన్ లో ఐటెమ్ అని పిలిచిన ఓ ఫ్యాన్ కి క్లాస్ పీకింది. విన్నర్ సినిమాలో మీరు ఐటెమ్ చేస్తున్నారట కదా అని ఆన్ లైన్ లైవ్ షోలో ఓ ఫ్యాన్ అడిగాడు అనసూయని. ఆ ప్రశ్నతో ఒక్కసారిగా ఆమె ముఖకవళికలు మారిపోయాయి. ``ఐటెమ్ ఏంటి అసలు? ఐటెమ్ అంటే ఒక వస్తువు. కానీ అమ్మాయిలు వస్తువులు కాదు. మీ ఆనందం కోసం స్పెషల్ సాంగ్స్లో నటిస్తుంటారు. దయచేసి ఆ పాటని ఐటెమ్ అని పిలవొద్దు`` అంది అనసూయ. ఆ క్లాస్ తీసుకోవడం చూశాక వామ్మో.. అనసూయ అనుకొన్నారంతా. అన్నట్టు విన్నర్లో ఆడిపాడినందుకు అనసూయ బాగానే ఛార్జ్ చేసినట్టు సమాచారం. బుల్లితెరతో పాపులారిటీ సంపాదించుకొన్న ఆమెకి యమా క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ని చూసే ఆమెకి సినిమా ఆఫర్లు వస్తున్నాయి.

,  ,  ,  ,  ,