Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Nov-2016 10:55:54
facebook Twitter Googleplus
Photo

ఓవైపు నటన కొనసాగిస్తూనే చదువు కూడా కొనసాగించే హీరోయిన్లు అరుదుగా ఉంటారు. ఐతే కోలీవుడ్లో తీరిక లేకుండా సినిమాలు చేస్తున్న తెలుగమ్మాయి శ్రీదివ్య ఈ కోవలోకే చెందుతుంది. ప్రస్తుతం శ్రీదివ్య తెలుగునాటే చదువుకుంటోంది. ఆమె నాగార్జున యూనివర్శిటీలో దూర విద్య ద్వారా డిగ్రీ చేస్తుండటం విశేషం. శ్రీదివ్య పెద్దగా చదువుకోలేదట. పదో తరగతితో చదువు ఆపేసిందట. చిన్న వయసులోనే టీవీ సీరియళ్లలో నటించే అవకాశం దక్కడంతో ఆమె పదో తరగతితో చదువుకు ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఐతే చదువు మధ్యలో ఆపేశానన్న బాధ తనను వెంటాడటంతో ఓపెన్ డిగ్రీ చేయాలని నిర్ణయించుకుని.. నాగార్జున యూనివర్శిటీలో చేరినట్లు శ్రీదివ్య వెల్లడించింది. డిగ్రీ అయ్యాక పీజీ కూడా పూర్తి చేస్తానని శ్రీదివ్య చెప్పింది.

ఇక కెరీర్ గురించి.. తన భవిష్యత్ గురించి శ్రీదివ్య చెబుతూ.. ??ప్రస్తుతం తమిళంలో తీరిక లేకుండా నటిస్తున్నా. చేతిలో క్రేజీ ప్రాజెక్టులున్నాయి. ఈ మధ్యే ?కాష్మోరా?తో మంచి సక్సెస్ ఖాతాలో వేసుకున్నా. తెలుగులోనూ ఎక్కువ సినిమాలు చేయాలని ఉంది. నాకు ఇద్దరితో సినిమాలు చేయాలనుంది. అందులో ఒకరు దర్శకుడు. ఇంకొకరు హీరో. మణిరత్నం సార్ దర్శకత్వంలో ఒక్క సినిమా చేయాలన్నది నా కల. అది నెరవేరుతుందో లేదో చూడాలి. అలాగే హీరో సూర్యతోనూ ఒక సినిమా చేయాలి. అనుకోకుండా సూర్య తమ్ముడు కార్తితో నటించే అవకాశం లభించింది. ఏదో ఒక రోజు ఈ రెండు కోరికలూ నెరవేరుతాయని ఆశిస్తున్నా?? అని శ్రీదివ్య తెలిపింది.

,  ,  ,  ,  ,  ,