Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Oct-2016 11:04:42
facebook Twitter Googleplus
Photo

తెలుగు బుల్లితెరకి సంబంధించి ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన యాంకర్ ప్రదీప్. అటు బుల్లితెర కార్యక్రమాలు ఇటు ఆడియో ఫంక్షన్లతో పాటు అప్పుడప్పుడు వెండితెరపై కూడా చిన్న చిన్న పాత్రల్లో కనిపిస్తూ ఫుల్ బిజీ అయిపోయాడు. యాంకర్ సుమకు దీటుగా ఎవరైనా పోటీ ఇస్తున్నారా అంటే అది ప్రదీప్ అని చెప్పినా అతిశయోక్తి కాదేమో. సాధారణంగా మహిళలకు సంబంధించి బుల్లితెర కార్యక్రమాలపై ముందు నుండీ మహిళా యాంకర్ల హవా కొనసాగుతోంది. అయితే ఈ విషయంలో ప్రదీప్ అలాంటి షోలను సైతం ఆసక్తికరంగా హ్యాండిల్ చేస్తుండటంతో అతనికి డిమాండ్ పెరిగింది.

హైదరాబాద్ లో ఈవెంట్ ఆర్గనైజర్ కెరీర్ మొదలు పెట్టిన ఈ ప్రదీప్ మాచిరాజు. తనకున్న టాకింగ్ స్కిల్స్ తో రేడియో జాకీగా అవకాశాన్ని సంపాదించుకున్నాడు ఆ జాబ్ లో మంచి పేరు గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ కు అందరినీ ఆకర్షించేలా మాట్లాడే నేర్పరితనంతో పాటు యాంకరింగ్ కు సూటయ్యే గుడ్ లుకింగ్ కూడా ఉండటంతో లోకల్ టీవీ ఛానల్ లో అవకాశం వచ్చింది. ఆ షో కాస్త సక్సెస్ కావడంతో ప్రదీప్ కు ఇక వరుసపెట్టి అవకాశాలు రావడం మొదలయ్యాయి.

అయితే కెరీర్ తొలినాళ్లలో ఈవెంట్ ఆర్గనైజర్ గా నెలకు రూ. 25 వేలు సంపాదించాడట. తర్వాత రేడియో జాకీగా తొలిసారి రూ. 20 వేలు తొలి టీవీ షోకు రూ. 15వేలు రెమ్యూనరేషన్ తీసుకున్న ప్రదీప్... ప్రస్తుతం ఒక్కో టీవీ షో ఎపిసోడ్ కు రూ. 50వేల వరకూ తీసుకుంటున్నాడట. ఇక కాస్త పెద్ద కార్యక్రమం అయితే అక్షరాలా లక్ష అంట. ఈ లెక్కన యావరేజ్ గా నెలకు సుమారు రూ.20 లక్షలు దాకా సంపాదిస్తున్నాడట. ప్రత్యేక కార్యక్రమాలు అవార్డు ఫంక్షన్లు ఇతర ఎంటర్ టైన్ మెంట్ ప్రోగ్రామ్ లకూ అంతే మొత్తంలో తీసుకుంటున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం బుల్లితెరపై అత్యంత బిజీ యాంకర్గా మారిపోయి ఓ స్టేజ్ వేసేసుకున్న ప్రదీప్ త్వరలో ఒక లీడ్ రోల్ లో వెండి తెరపై కూడా కనిపించనునాడని వార్తలొస్తున్నాయి!

,  ,  ,  ,  ,