Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Aug-2017 12:19:42
facebook Twitter Googleplus
Photo

సుమ ఝాన్సీ ఉదయభాను లాంటి వారు సీనియర్ యాంకర్లుగా వాళ్ళ హవా కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పుడు వీళ్లతో పాటుగా మరో కొంతమంది యాంకర్లు స్టార్ లుగా మారారు మన టివి సినిమా ఇండస్ట్రిలు వలన. అనసూయ లాంటి హాట్ యాంకర్లు దీటుగా మరో తెలుగు బ్యూటీ యాంకర్ గా తన సత్తా చాటుతుంది. యాంకర్ శ్యామల ఏ పండగ వచ్చిన తెలుగులో ఏ ఫ్యామిలి షో వచ్చిన తన యాంకరింగ్ తో ఆ షోని మరింత విజయవంతం చేస్తుంది. అలాంటి శ్యామల ఈ మధ్య టివి లో కాని ఫిల్మ్ ఈవెంట్లులో కాని కనిపించటం లేదు ఎందుకు అనే ఆలోచన మీకు వచ్చే ఉంటుంది.

యాంకర్ గా బాగా బిజీ గానే ఉంది కదా ఒక్కసారి ఈ అమ్మాయి ఎటు వెళ్లింది అని ఆ మధ్య చాలామంది అడుగుతూ వచ్చారు. దానికి కారణం ఏంటంటే ఈమె తన అమ్మతనం కోసం కొద్ది కాలం గ్యాప్ తీసుకుంది. కొద్ది గంటలు కిందటనే శ్యామల ఒక బాబుకి జన్మనిచ్చింది. కొత్త గా వచ్చిన అమ్మతనాన్ని ఇప్పుడే పుట్టిన తన బాబుతో ప్రతి క్షణం ఆ ఆనందాన్ని అనుభవిస్తుంది. కొంత కాలం విరామం తీసుకొని మళ్ళీ తిరిగిరావడానికి అన్నీ సిద్దం చేసుకుంటుంది శ్యామల. ఆమె పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు చూస్తుంటే మనకు అర్ధంవుతుంది లెండి ఆమె ఎంతగా ప్రపంచాన్ని మరిచి ఆనందంలో తేలుతుందోని.

గతంలో కూడా ఉదయభాను కూడా యాంకరింగ్ కు కొంతకాలం గ్యాప్ తీసుకొని ఇద్దరు కవలలును కని మళ్ళీ బిజీ అయ్యింది. ఇప్పుడు శ్యామల కూడా అలానే తన ఫ్యామిలి లైఫ్ ని ఇటు వర్క్ లైఫ్ ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్ళే పనిలో పడింది. ఫ్యామిలి షో యాంకర్ గా మంచి పేరు తెచ్చుకున్న శ్యామల సినిమా ఈవెంట్లు ను కూడా అంతే చక్కగా చేస్తుంది.

,  ,  ,  ,