Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Feb-2017 11:05:11
facebook Twitter Googleplus
Photo

సెక్సీ హీరోయిన్ శృతి హాసన్.. అలాగే స్టార్ యాంకర్ సుమ. వీళ్ళిద్దరికీ కనక్షన్ ఏదైనా ఉంటే.. శృతి హీరోయన్ గా చేసిన కొంతమంది బడా స్టార్స్ సినిమాల ఆడియో ఫంక్షన్లకు సుమ యాంకరింగ్ చేసిందంతే. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరికీ కూడా ఒక కనక్షన్ వచ్చేసింది. చిన్నప్పటి నుండీ మ్యూజిక్ లో తర్ఫీదు పొందిన శృతి.. సింగర్ గా చాలా ప్రయోగాలే చేసింది. కాని మొన్నటివరకు స్టేజీలపై నేను జస్ట్ బాత్రూమ్ సింగర్ నే అని చెప్పిన సుమ కూడా.. ఇప్పుడు శృతి హాసన్ తరహాలో పాటేసుకుంది. ఇదంతా తెలిసిందే. కాని వీరు పాడిన పాటలకు ఒక ప్రత్యేకత ఉంది.

ఆగడు సినిమాలో 'జంక్షన్లో' అంటూ అప్పట్లో తమన్ కంపోజిషన్లో ఒక పాటేసుకుంది శృతి. ఇప్పుడు అనసూయ ఐటెం సాంగ్ ను కూడా అదే తరహాలో సుమ కూడా సింగేసింది. వీళ్లిద్దరూ ఆ పాటను పాడారని మీడియా చెప్పేవరకు జనాలు మాత్రం గుర్తుపట్టట్లేదు. దానికి కారణం ఏంటో తెలుసా? నిజానికి సింగర్ ఒరిజినల్ వాయిస్ ను రిటైన్ చేసి.. ఆ వాయిస్ లోని మాధుర్యాన్ని.. జీరతత్వాన్ని.. అలాగే ఉంచేస్తారు చాలామంది కంపోజర్లు. కాని తమన్ మాత్రం.. పాడింది ఎవరైనా కూడా తన సొంత వాయిస్ ప్రోసెస్ ప్లగిన్స్ తో ఆ వాయిస్ ను డిజిటిల్ సౌండు టైపులో ట్యూన్ చేస్తాడు. అందువలన.. పాట పాడింది పలానా అని మనం తెలుసుకోవడానికి చాలా టైమ్ పడుతుంది. అప్పుడు శృతి.. ఇప్పుడు సుమ విషయాల్లో అదే జరిగింది.

,  ,  ,  ,  ,