Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Mar-2017 10:25:35
facebook Twitter Googleplus
Photo

పెళ్లి చూపులు మూవీతో విజయ్ దేవరకొండకు విపరీతమైన గుర్తింపు వచ్చేసింది. అయితే.. తన కొత్త సినిమా ద్వారకతో తిరికి అలాంటి ఫీట్ సాధించడంలో ఫెయిలయ్యాడు ఈ హీరో. సినిమా సక్సెస్ అనిపించుకోకపోయినా.. విజయ్ దేవరకొండ ఓ విషయంలో మాత్రం అందరి మీదా విజయం సాధించేశాడు.

ద్వారక రిలీజ్ తర్వాత ఈ కుర్రాడు ఇచ్చిన స్టేట్మెంట్ అందరినీ ఆకట్టుకుంటోంది. తన సినిమాని మెచ్చుకున్న వాళ్లతో పాటు.. విమర్శించిన వాళ్లకు కూడా కృతజ్ఞతలు చెప్పాడు. అంతే కాదు.. తిరిగి సరిదిద్దుకుంటానని కూడా చెప్పాడు. "నేను కొన్ని రివ్యూలు చదివాను. క్రిటిక్స్ కి నా సినిమా నచ్చలేదు. పర్లేదు. నా తర్వాతి సినిమతో వారి మనసులు గెలుచుకునేందుకు ప్రయత్నిస్తాను. ఇక్కడ నేను ఇంకా బుడిబుడి అడుగులు వేస్తున్నానంతే. ప్రేక్షకుల మనసు గెలుచుకునేందుకు కష్టపడతాను" అంటూ నిజాయితీగా చెప్పాడు విజయ్ దేవరకొండ.

ఈ మధ్య కాలంలో కొందరు స్టార్లు కూడా సినిమాకు వ్యతిరేకంగా రివ్యూలు వస్తే.. తిట్టి పోసేస్తున్నారు. కానీ ఈ కుర్రాడు మాత్రం ఎంతో హుందాగా సమాధానం ఇవ్వడమే కాదు.. తన తప్పుంటే సరిదిద్దుకుంటానని.. సినిమాలను మెరుగుపరుచుకుంటానని చెప్పడం విశేషం. ప్రస్తుతం అర్జున్ రెడ్డి అనే చిత్రాన్ని ఫినిష్ చేస్తున్న హీరో.. గీతా ఆర్ట్స్ తో ఓ రెండు సినిమాల డీల్ సైన్ చేశాడు

,  ,  ,  ,  ,  ,