Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Nov-2017 13:04:28
facebook Twitter Googleplus
Photo

సినీ నటులు సెన్సేషనల్ కామెంట్లు చేయడంలో ఏమాత్రం వెనుకాడడం లేదు. బాలీవుడ్ లో కంగనా రనౌత్ నుంచి టాలీవుడ్ లో పలువురు హీరోయిన్ల వరకు అంతా ఓపెన్ గా మాట్లాడుతున్నారు. తాజాగా హీరోయిన్ ఆండ్రియా కూడా అదే తరహాలో సెన్సేషనల్ కామెంట్లు చేశారు. అమ్మాయిలు ఎవరితో పడుకుంటుందన్నది పూర్తిగా వారి వ్యక్తిగత విషయం అని ఆ విషయంలో వారిని ఎవరూ బలవంతం చేయరాదని అన్నారు. కొద్దికాలంగా పాపులర్ అయిన మీటూ హ్యాష్ ట్యాగ్పై స్పందిస్తూ ఆమె ఈ మాటలన్నారు. తనకు కెరీర్ లో ఎక్కడా లైంగికంగా వేధింపులు ఎదురుకాలేదన్నారు. అలాంటి సమస్యలుంటే ఆ సినిమాను వదులుకుంటానని చెప్పారు.

విశాల్ హీరోగా నటించిన ‘డిటెక్టివ్’ చిత్రంలో నటించిన ఆమె సినిమా గురించి కూడా ముచ్చట్లు చెప్పారు. డిటెక్టివ్ ఒక థ్రిల్లింగ్ మూవీ అని ఆమె చెప్పుకొచ్చారు. తమిళంలో మంచి విజయాన్ని సాధించిన ఈ సినిమా తెలుగులో ఈ నెల 10న విడుదల కానుంది. ఇందులో ఆండ్రియా గ్రే షేడ్స్ ఉన్న పాత్ర చేసింది. ఆ పాత్ర కోసం ఆమె కొన్ని యాక్షన్ సీన్లు కూడా చాలా కష్టపడి చేసిందట. సినిమా కోసం హార్లీ డేవిడ్ సన్ బైక్ను నడపడం కూడా నేర్చుకుందట.

తనను ఎగ్జయిట్ చేసే అంశాలు ఉన్నప్పుడే ఆ సినిమాలు చేస్తానని.. ఎలాంటి ఎగ్జయిట్మెంట్ లేకపోతే సినిమాలు చేయనని చెప్పారు. ప్రస్తుతం తెలుగులో మూడు సినిమాలు తనవి విడుదల కానున్నాయని చెప్పారు.

,  ,  ,  ,