Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

31-Jan-2017 15:27:22
facebook Twitter Googleplus
Photo

క్రియేటివిటీ చూపించడం అన్నది చిన్న విషయం కాదు. నిరంతం కొత్త ఆలోచనలతో జనాల్ని ఆకట్టుకోవడమంటే అందుకు అసాధారణ ప్రతిభ ఉండాలి. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ కోవకే చెందుతాడు. కొందరు ఎంత ప్రయత్నించినా తమ సినిమాలపై జనాల్లో క్యూరియాసిటీ తీసుకు రాలేరు. కానీ సుకుమార్ ఎఫర్ట్ లెస్ గా జనాల్లో తన సినిమాపై ఆసక్తి రేకెత్తిస్తాడు. ప్రేక్షకుడు ఊహించనిది ఇచ్చి సర్ప్రైజ్ చేయడం అతడి శైలి. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కించనున్న కొత్త సినిమా విషయంలోనూ సుక్కు అలాగే సర్ప్రైజ్ చేసేలా ఉన్నాడు. కేవలం ఒక థీమ్ పోస్టర్ తో సుక్కు జనాల్లో ఈ సినిమాపై విపరీతమైన ఆసక్తి రేకెత్తించాడు.

సుకుమార్ సినిమాల్లో కొన్ని హిట్టవ్వచ్చు. కొన్ని ఫ్లాప్ కావచ్చు. కానీ అతను ప్రతిసారీ ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేస్తూనే ఉన్నాడు. ?ఆర్య? లాంటి ప్లెజెంట్ లవ్ స్టోరీ తర్వాత ?జగడం? లాంటి విలక్షణమైన సినిమాను అతడి నుంచి ఎవరూ ఊహించలేదు. ఆ తర్వాత ?ఆర్య-2? అనగానే ?ఆర్య? లాంటి సినిమా అనుకున్నారు. కానీ సుక్కు ప్రేక్షకుల అంచనాలకు అందని విధంగా ఆ సినిమాను తీర్చిదిద్దాడు. జగడం.. ఆర్య-2 అప్పటికి కొన్ని కారణాల వల్ల ఆడకపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు చూస్తుంటే మళ్లీ చూడాలనిపిస్తాయి. ఆ తర్వాత 100 పర్సంట్ లవ్.. 1 నేనొక్కడినే.. నాన్నకు ప్రేమతో.. ఫలితాలతో ఈ మూడు సినిమాలూ కూడా ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేసినవే. ఇప్పుడు రామ్ చరణ్ తో చేయబోయే సినిమాతోనూ సుక్కు ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి గురి చేసేలాగే ఉన్నాడు. ఈ సినిమా థీమ్ పోస్టర్ టాలీవుడ్లో పెద్ద చర్చకే దారి తీసింది. రామ్ చరణ్ లాంటి మోడర్న్ గా కనిపించే హీరోతో లుంగీ కట్టించి.. కావడి కుండలు మోయిస్తూ థీమ్ పోస్టర్ రిలీజ్ చేయడం అన్నది జనాలకు పెద్ద షాకే.

చరణ్ గడ్డం పెంచుతుంటే ?నాన్నకు ప్రేమతో?లో ఎన్టీఆర్ లాగా కనిపిస్తాడేమో అనుకున్నారు. కానీ అతణ్ని పల్లెటూరి వాడిగా చూపిస్తూ సుక్కు పెద్ద సంచలనానికి తెర తీసేలా కనిపిస్తున్నాడు. సుక్కు గత సినిమాలతో పోల్చుకుంటే అసలీ సినిమా ఎలా ఉంటుంది అన్నదే అంతు బట్టడం లేదు. సుక్కు శైలికి విలేజ్ స్టోరీ అన్నదే ఊహకందని విషయం. పైగా ఇది కొన్ని దశాబ్దాల కిందటి నేపథ్యంలో నడుస్తుందంటున్నారు. చరణ్ పల్లెటూరి వాడి పాత్ర చేయడమే ఆశ్చర్యమంటే.. అతడికి వినికిడి సమస్య ఉన్నట్లు చూపించబోతున్నారన్న సమాచారమూ విస్మయానికి గురి చేస్తోంది. మొత్తానికి ఇంకా సెట్స్ మీదికి వెళ్లకముందే.. సుక్కు తన కొత్త సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన క్యూరియాసిటీ తీసుకురావడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు. ఇక మున్ముందు సినిమాకు సంబంధించి అప్ డేట్స్ బయటికి వచ్చాక సినిమా విడుదలయ్యే సమయానికి హైప్ ఎలా ఉంటుందో అంచనా వేయొచ్చు.

,  ,  ,  ,  ,  ,