Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Nov-2017 10:15:38
facebook Twitter Googleplus
Photo

యుగానికి ఒక్కడు.. చంద్రకళ..సరసుడు లాంటి సినిమాలతోనూ తెలుగు ప్రేక్షకులకు ఆమె పరిచయమే. ఐతే ఈ సెక్సీ భామ హీరోయిన్ కావడానికంటే ముందు సింగర్. ఆమె తమిళంలో అదిరిపోయే పాటలు పాడింది. టిపికల్ వాయిస్ తో చాలా స్టైలిష్ గా పాటలు పాడుతుంది ఆండ్రియా. ఇప్పుడు తొలిసారి తెలుగులో ఓ పాట పాడబోతోంది ఆండ్రియా. ఆమె సింగర్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోయేది మహేష్ బాబు సినిమాతో కావడం విశేషం.

మహేష్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘భరత్ అను నేను’లో ఆండ్రియా ఓ పాట పాడనుంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త సింగర్లను తీసుకొచ్చి పాటలు పాడించడం దేవిశ్రీ ప్రసాద్ కు అలవాటు. ఈ క్రమంలోనే ఆండ్రియాకు అవకాశమిచ్చాడతను. తమిళంలో కొన్ని పాటలతో మెస్మరైజ్ చేసిన ఆండ్రియా.. తెలుగులోకి ఎలాంటి ఎంట్రీ ఇస్తుందో చూడాలి. భరత్ అను నేను కోసం కొన్ని నెలల నుంచి పని చేస్తున్నాడు దేవిశ్రీ ప్రసాద్. ఈ మధ్య దేవి చేసిన కొన్ని ఆడియోలు అంతగా ఆకట్టుకోకపోవడం.. పెద్ద ప్రాజెక్టులు అతడి చేజారుతున్న నేపథ్యంలో భరత్ అను నేను అతడి కెరీర్ కు కీలకంగా మారనుంది.

,  ,  ,  ,  ,  ,