Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Jan-2015 10:55:11
facebook Twitter Googleplus
Photo

గుణశేఖర్ ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న 'రుద్రమదేవి' చిత్రం విడుదల అందరూ ఊహించినట్టుగానే వాయిదాపడింది. మొదట్లో ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కానందున ఇది సంక్రాంతికి విడుదలవడం కష్టమంటూ వార్తలొచ్చాయి. అందుకు తగ్గట్టుగానే దర్శకుడు గుణశేఖర్ తాజాగా దీనిని ధ్రువపరచాడు. సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నామనీ, అయితే నిర్మాణానంతర కార్యక్రమాలు ఇంకా జరుగుతున్నందున ఇక వేసవికి దీనిని రిలీజ్ చేస్తామని ఆయన అన్నారు. దీనిని బట్టి చూస్తే, దీని విడుదల ఇక ఏప్రిల్, మే నెలలకు వెళుతున్నట్టుగానే భావించాలి. అనుష్క 'రుద్రమదేవి'గా నటిస్తున్న సంగతి విదితమే!

,  ,  ,  ,  ,  ,  ,