Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-May-2016 16:14:30
facebook Twitter Googleplus
Photo

తొలి మూవీ పటాస్ తోనే సూపర్ సక్సెస్ సాధించి ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఇప్పుడు సుప్రీమ్ అంటూ మే 5న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సాయిధరం తేజ్ హీరోగా రూపొందిన సుప్రీమ్.. ప్రీ రిలీజ్ బిజినెస్ లో ట్రేడ్ సర్కిల్స్ కి మైండ్ బ్లాంక్ చేసింది. ఇంతగా ఈ మూవీ బిజినెస్ జరగానికి.. అనిల్ రావిపూడిపై ఉన్న నమ్మకం కూడా కారణమే.

అసలు ఈ మూవీ రిజల్ట్ పై ఏ మాత్రం అనుమానం లేదని చెబ్తున్న డైరెక్టర్.. ఇది పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్టెయినర్ అంటున్నాడు. పటాస్ స్క్రీనింగ్ సమయం నుంచి దిల్ రాజుతో ఏర్పడ్డ పరిచయం.. సుప్రీమ్ ను తెరకెక్కించేవరకు చేరిందన్నాడు అనిల్ రావిపూడి. ముందు స్టోరీని సిద్ధం చేసుకున్నాక.. తేజు అయితే ఈ కేరక్టర్ కి సరిపోతాడని దిల్ రాజు చెప్పాడట. అందుకు తగ్గట్లుగానే ఈ పాత్రలో ఒదిగిపోయాడని చెప్పాడు ఈ దర్శకుడు.

తనపై 80 - 90ల్లో వచ్చిన సినిమాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని అందుకే అప్పటి పాటలకు రీమిక్స్ లు తన మూవీస్ లో కనిపిస్తాయని చెప్పాడు. సుప్రీమ్ లో రాశిఖన్నా పాత్ర చాలా స్పెషల్ గా ఉంటుందని ఈ మూవీ తర్వాత హీరోయిన్ కేరక్టర్ల డిజైనింగ్ లో కూడా మార్పులు వస్తాయని నమ్మకంగా చెబుతున్నాడు అనిల్ రావిపూడి. బన్నీ సరైనోడు ఇచ్చిన జోష్ తో ఊపుమీదున్న మెగా ఫ్యాన్స్ కు.. సుప్రీంతో సాయిధరం తేజ్ మరింత ఎనర్జీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

,  ,  ,  ,  ,  ,