Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Dec-2017 10:32:23
facebook Twitter Googleplus
Photo

అజ్ఞాతవాసి సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూసిన అభిమానుల ఖుషి మరి కొన్ని రోజుల్లో నెరవేరబోతోంది. అయితే రేపు ఆడియో వేడుకను చిత్ర యూనిట్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేయబోతోంది. సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్ అయితే మరొక మేజర్ ప్లస్ పాయింట్ అనిరుద్ అని చెప్పాలి.

సినిమాకు అనుకున్నట్టుగానే సూపర్ మ్యూజిక్ ను అందించాడు. రిలీజ్ అయిన రెండు పాటలతోనే తెలుగులో మొదటి అడుగును గుర్తుండిపోయేలా వేశాడు. అయితే తన తొలి తెలుగు సినిమా కాబట్టి అనిరుద్ ఆడియో వేడుకలో స్పెషల్ సర్ప్రైజ్ ఇవ్వనున్నాడట. ఇప్పటికే పవన్ కోసం గాలి వాలుగా సాంగ్ ని పాడి స్పెషల్ గా డ్యాన్స్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ సాంగ్ టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ని అందుకుంటోంది.

అయితే వేడుకలో అనిరుద్ దాదాపు ఒక గంట పాటు నాన్ స్టాప్ గా పర్ఫెమెన్స్ ఇవ్వనున్నాడట. అజ్ఞాతవాసి సినిమా పాటలనే కాకుండా పవన్ కళ్యాణ్ హిట్ సినిమాల పాటలను కూడా అనిరుద్ స్వయంగా పాడనున్నాడట. మొత్తానికి అనిరుద్ తన తొలి తెలుగు సినిమా ఎప్పటికి గుర్తుండిపోయేలా ప్లాన్ చేసుకుంటున్నాడు అనమాట.

ఇక పాస్ ల కోసం అభిమానులు చాలా పోటీ పడ్డారు. హారికా హాసిని క్రియేషన్స్ ఆఫీస్ దగ్గర కొంచెం తొక్కిసలాట కూడా జరిగింది.

,  ,  ,  ,  ,  ,