Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Apr-2016 10:38:07
facebook Twitter Googleplus
Photo

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఎక్కువ సినిమాలకు పనిచేసిన యునీక్ టెక్నీషియన్ గా దేవిశ్రీ ప్రసాద్ నిలుస్తారు. వీరి కాంబినేషన్ లో వచ్చిన జల్సా - గబ్బర్ సింగ్ - అత్తారింటికి దారేది ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ మంచి హిట్ ఆల్బమ్స్ గా నిలిచాయి. రేపు సర్దార్ తన ఎర్ర కండువా ఎగురవేయనున్నతరుణంలో సినిమా గురించి దేవి చెప్పిన కొన్ని పలుకులు మీకోసం..

పవన్ సినిమా అనగానే ఎక్కడాలేని కిక్ వచ్చేస్తుందని అందుకే ఆయనతో పనిచేయడం చాలా ఇష్టమని తెలిపాడు. సినిమా గురించి విశేషాలు చెప్పమంటే ఈ చిత్రానికి రీ రికార్డింగ్ ఇచ్చిన సమయంలో పవన్ డ్యాన్సులు చూసి మతిపోయిందని ముఖ్యంగా దాయి దాయి దామ్మలో వీణ స్టెప్ అభిమానులకు పండుగేనని ఊరించాడు.

పవన్ కి పెర్సనల్ గా మెలోడీ సాంగ్స్ ఇష్టమట. ఈ ఆల్బమ్ లో నీ చేప కళ్ళు.. పాట పవన్ ఫేవరేట్ అని తెలిపాడు.. సర్దార్ గబ్బర్ సింగ్.. హీ ఈజ్ బ్యాక్ టు డూ సమ్ థింగ్ అంటూ ముగించాడు.

,  ,  ,  ,  ,