Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Jul-2016 11:44:45
facebook Twitter Googleplus
Photo

బిచ్చగాడు అనే సినిమా సృష్టించిన సంచలనంతో హీరో విజయ్ ఆంటోనీ తెలుగులో ఒక్కసారే పాపులర్ అయిపోయారు. సంగీత దర్శకుడిగా తమిళనాట కెరీర్ ప్రారంభించిన విజయ్, ఆ తర్వాత హీరోగా మారి వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. గతంలో ఆయన హీరోగా నటించిన ?సలీమ్? అనే సినిమా తెలుగులోనూ విడుదలై ఆయనకు మంచి పేరే తెచ్చిపెట్టింది. ఇక తాజాగా వచ్చిన బిచ్చగాడు సినిమా అయితే ఎవ్వరి ఊహకూ అందని స్థాయి విజయాన్ని సొంతం చేసుకొని విజయ్ ఆంటోనీకి క్రేజ్ తెచ్చిపెట్టింది.
ఇక ఇక్కడి ప్రేక్షకులు తన సినిమాపై చూపించిన అభిమానానికి ఋణపడి ఉంటానని విజయ్ ఆంటోనీ తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగులో త్వరలోనే ఒక స్ట్రైట్ సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు విజయ్ ఈ సందర్భంగా తెలిపారు. తెలుగులో నేరుగా ఓ సినిమా చేసేందుకు స్క్రిప్ట్ వింటున్నానని, త్వరలోనే ఆ సినిమా మొదలవుతుందని అన్నారు. ఇక బిచ్చగాడు సినిమా విషయానికి వస్తే, ఇప్పటివరకూ 20కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా 50 రోజులు దాటాక కూడా బాక్సాఫీస్ వద్ద అదే జోరు కొనసాగిస్తోంది.

,  ,  ,  ,  ,