Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Sep-2016 11:30:26
facebook Twitter Googleplus
Photo

నేచురల్ స్టార్ నాని స్పీడ్ చూస్తుంటే.. టాలీవుడ్ జనాలు కెవ్వు కేకలు పెట్టేసే పరిస్థితి. టాప్ స్టార్స్ నుంచి యంగ్ హీరోల వరకూ ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేసేందుకే నానా తంటాలు పడుతున్నారు. స్టోరీ కుదరలేదని.. రెమ్యూనరేషన్ సెట్ కాలేదని.. డేట్స్ క్లాష్ అయ్యాయని.. రకరకాల రీజన్స్ చెబుతున్నారు. కానీ ఇలాంటివేవీ నానికి మాత్రం ఎదురవకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం.

నాని ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలు రిలీజ్ చేశాడు. ఫిబ్రవరిలో కృష్ణగాడి వీర ప్రేమగాధ.. జూన్ లో జెంటిల్మన్ లను విడుదల చేసి సక్సెస్ సాధించాడు. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమాగా 'మజ్ను' ను లైన్ లో పెట్టాడు. సెప్టెంబర్ 22న ఈ సినిమా విడుదల కానుండగా.. ఇప్పుడు ఇదే ఏడాది నాని నటించిన నాలుగో సినిమా కూడా రిలీజ్ రెడీ కానుందని తెలుస్తోంది. సినిమా చూపిస్త మామా ఫేమ్ దర్శకుడు త్రినాథ రావు డైరెక్షన్ లో నాని నటిస్తున్న మూవీ 'నేను లోకల్'. ఇప్పుడీ సినిమా షూటింగ్ 50శాతానికి పైగా పూర్తయిపోయిందని తెలుస్తోంది. దీన్ని క్రిస్మస్ పండుగకు విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నాడట నాని.

విచిత్రం ఏంటంటే.. ఆగస్ట్ మొదటివారంలో నేను లోకల్ షూటింగ్ స్టార్ట్ చేయగా.. నెల రోజుల్లోనే సగం కంప్లీట్ అయిపోవడం. ఈ స్పీడ్ లో షూటింగ్ చేసేస్తే.. అక్టోబర్ చివరి కల్లా సినిమా పూర్తయిపోతుంది. సో.. డిసెంబర్ ఎండింగ్ లో రిలీజ్ పెద్ద విషయమేం కాదు. నానీ.. నీ ప్లానింగ్ సూపరెహ అనాల్సిందే కదూ!

,  ,  ,  ,  ,