Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Sep-2016 10:50:07
facebook Twitter Googleplus
Photo

1.. 2.. 3.. 4.. చూస్తుండగానే ఏడాదిన్నర గడిచిపోయింది. నాలుగు హిట్లిచ్చేశాడు నాని. అందులో ?భలే భలే మగాడివోయ్? బ్లాక్ బస్టర్ హిట్టు. ఆ సినిమాకే ?నేచురల్ స్టార్? అని నాని పేరు ముందు ఓ తోక కూడా తగిలించారు. ముందు అది చూసి తమాషాగా నవ్వుకున్నారు జనాలు. కానీ ఇప్పుడు స్టార్ అని అందరూ ఒప్పుకుంటున్నారు. ట్రెండుకు తగ్గట్లుగా వైవిధ్యమైన పాత్రలు చేస్తూ.. కంటెంట్లో క్వాలిటీ చూపిస్తూ దూసుకెళ్తున్నాడు నాని. తెలుగులో ప్రస్తుతం అత్యంత ఇష్టుడైన నటుడెవరంటే నాని పేరు ముందు వరుసలో చెప్పకోవాలి. స్టార్ హీరోలు చాలామందికి యాంటి ఫ్యాన్స్ ఉంటారు కానీ.. నాని విషయంలో మాత్రం అతడిపై వ్యతిరేకత ఉన్న వాళ్లే ఉండరంటే అతిశయోక్తి లేదేమో.

మామూలుగా స్టార్ హీరోలు క్యామియో రోల్స్ చేసినపుడు మాత్రమే థియేటర్లలో ఒకరకమైన స్పందన వస్తుంది. ?జ్యో అచ్యుతానంద? సేమ్ అలాంటి రెస్పాన్సే కనిపించింది నాని తెరమీద దర్శనమిచ్చినపుడు. ఈ సినిమాలో నాని ఓ స్పెషల్ రోల్ చేశాడన్న సంగతి తెలిసిన విషయమే. ఐతే క్లైమాక్స్ అయిపోతుండగా నాని ఇంకా రాలేదేంటి రాలేదేంటి అనుకుంటుండగా న్యూస్ పేపర్ చాటున ముఖం దాచుకుని ఉన్న ఓ వ్యక్తి పక్కన వెళ్లి రెజీనా కూర్చోగానే జనాలకు విషయం అర్థమైపోయింది. థియేటరంతా ఒకటే గోల గోల. అక్కడున్నది నాని అన్న సంగతి ముందే పసిగట్టేశారు. ఇక అతను తెర తొలగించి ముఖం చూపించగానే థియేటర్ హోరెత్తింది. దీన్ని బట్టే నాని ఎలాంటి ఇమేజ్ సంపాదించుకున్నాడో అర్థమైపోతుంది.కనిపించింది ఓ నిమిషం.. మాట్లాడింది నాలుగు ముక్కలే అయినా నాని స్క్రీన్ ప్రెజెన్స్ అదిరింది. చివరగా ఈ సినిమాలో రెజీనా సొంతమయ్యేది నానికే. అదే అతడి క్యారెక్టర్.

,  ,  ,  ,  ,  ,  ,