Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-May-2017 10:15:21
facebook Twitter Googleplus
Photo

తెలుగులో గత రెండు దశాబ్దాల్లో ఏ హీరోయిన్ చేయని సాహసోపేత పాత్రలు చేసింది అనుష్క. అరుంధతి.. రుద్రమదేవి.. ఆమెకు మైల్ స్టోన్ రోల్స్ అయ్యాయి. ‘సైజ్ జీరో’లో ఆమె చేసిన పాత్ర కూడా మరో మైలు రాయి అవుతుందనే అనుకున్నారంతా. ఈ పాత్ర కోసం అనుష్క ఎంత త్యాగం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భారీగా బరువు పెరిగి.. గుర్తుపట్టలేని రూపంలోకి మారింది అనుష్క. కానీ ఆమె కష్టానికి తగ్గ ఫలితం దక్కలేదు. సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది.

పైగా అనుష్క మునుపటి లుక్ లోకి రావడం చాలా కష్టమైంది. ఇప్పటికీ ఆమె ఇంకా పూర్వపు రూపాన్ని సంతరించుకోలేదు. అనుష్క లుక్ మారిపోవడం వల్ల ‘బాహుబలి’ లాంటి భారీ సినిమాకు కూడా ఇబ్బంది తప్పలేదు. అనుష్కను మామూలుగా చూపించడానికి వీఎఫెక్స్ కోసం భారీగా ఖర్చు చేయాల్సిన అవసరం కూడా వచ్చినట్లు వార్తలొచ్చాయి. ఐతే ‘సైజ్ జీరో’ వల్ల ఇంత ఇబ్బంది తలెత్తినప్పటికీ ఆ సినిమా చేసినందుకు తనకు బాధేమీ లేదని అంటోంది అనుష్క.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో అనుష్క మాట్లాడుతూ.. ‘సైజ్ జీరో’ సినిమా తాను ఎంతో ఇష్టపడి చేసిందని చెప్పింది. పాత్ర కోసం సహజంగా బరువు పెరగాలని కూడా తానే నిర్ణయించుకున్నానని.. ఆ సినిమా ఎలాంటి ఫలితాన్నిచ్చినప్పటికీ.. అది చేసినందుకు రిగ్రెట్స్ ఏమీ లేవని అనుష్క తెలిపింది. ప్రస్తుతం అనుష్క నటిస్తున్న ‘భాగమతి’ కోసం ఆమె ఇంకా కొంచెం బరువు తగ్గాల్సి ఉందట. గత కొన్ని రోజులుగా షూటింగుకి బ్రేక్ ఇచ్చి.. బాహుబలి-2 ప్రమోషన్లలో పాల్గొంటోంది అనుష్క

,  ,  ,  ,  ,