Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Sep-2016 13:41:08
facebook Twitter Googleplus
Photo

హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ ను హీరోగా పరిచయం చేస్తూ.. అక్కినేని నాగార్జున నటించి నిర్మించిన చిత్రం నిర్మలా కాన్వెంట్. భారీ ప్రమోషన్స్.. టాలీవుడ్ మొత్తానికి ప్రీమియర్.. మెగాస్టార్ చిరంజీవితో ప్రశంసలు.. నాగార్జున చేసిన లెంగ్తీ రోల్.. కలర్ ఫుల్ ప్రోమోస్.. ఇవేవీ నిర్మలా కాన్వెంట్ ని కాపాడగలిగేట్లుగా కనిపించడం లేదు.

ఓపెనింగ్స్ రాబట్టుకోవడంలో కూడా విఫలమైన ఈ చిత్రం.. వీకెండ్ కంప్లీట్ అయ్యేపాటికి మరింత దిగజారిందని ఇండస్ట్రీ జనాలు అంటున్నారు. శ్రీకాంత్ కొడుకు అరంగేట్రాన్ని ఆడియన్స్ పెద్దగా పట్టించుకోలేదు. పక్క ప్రాంతాల సంగతి తర్వాత.. ముందు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయింది ఈ చిత్రం. నాగార్జున నిర్మించడం అంటే.. టీనేజ్ లవ్ స్టోరీని కొత్తగా ప్రజెంట్ చేసి ఉంటారనే అంచనాలతో భారీ రేట్లకు కొనేశారు బయ్యర్లు.

ఇప్పుడు పెట్టుబడిలో 20శాతం తిరిగి రావడం కూడా కష్టమనే అంచనాలు వస్తుండంతో.. నిర్మలాకాన్వెంట్ భారీ డిజాస్టర్ గా మిగిలిపోనుంది. విడుదల ముందువరకూ అగ్రెసివ్ ప్రమోషన్స్ చేసిన నాగ్ కూడా.. ఇప్పుడు సైలెంట్ అయిపోవడం చూస్తే.. ఇకపై పుంజుకుంటుందనే హోప్స్ ను ఇప్పటికే వదిలేసుకున్నట్లు అర్ధమైపోతోంది.

,  ,  ,  ,  ,  ,