Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Jun-2016 13:38:00
facebook Twitter Googleplus
Photo

ఐటెమ్ పాటల విషయంలో తోటి కథానాయికలంతా ఒక అడుగు ముందే ఉన్నారు. కాజల్ మాత్రం ఇప్పటిదాకా ఆ పాటపై దృష్టి పెట్టనే లేదు. మంచి పాట వస్తే ఎందుకు చేయను అంటోంది తప్ప ఆ దిశగా ఆమె ప్రత్యేక అందాల్ని ప్రదర్శించిందే లేదు. అయితే తోటి కథానాయికలైన శ్రుతిహాసన్ - తమన్నా - అనుష్క లాంటివాళ్లంతా అప్పుడప్పుడు ఐటెమ్ గాళ్స్ గా మారి దుమ్ము దులిపేస్తున్నారు. కాస్త ఆలస్యమైనా ఎట్టకేలకి ఇటీవల కాజల్ కూడా ఐటెమ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

అయితే కాజల్ ఐటెమ్ గాళ్ గా మారుతుంది ఎవరికో కాదు... చరణ్ కి! కాజల్ - రామ్ చరణ్ లది హిట్ పెయిర్. ఇద్దరూ కలిసి నాలుగు సినిమాల్లో నటించారు. మరోసారి కూడా ఇద్దరినీ తెరపై చూడాలని ఆశపడుతున్నారు అభిమానులు. ఆ అవకాశాన్ని ఓ ఐటెమ్ పాటతో ఇచ్చారన్నమాట. రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న ధ్రువ కోసమే కాజల్ ఐటెమ్ భామ అవతారమెత్తనున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరి ఆ విషయంలో నిజమెంతన్నది కాజలే క్లారిఫై చేయాలి. అన్నట్టు కాజల్ కి ఇటీవల వరుసగా పరాభవాలు ఎదురవుతున్నాయి. తెలుగులో చేసిన రెండు సినిమాలతో పాటు - హిందీలో చేసిన చిత్రం కూడా బోల్తా కొట్టింది. దీంతో ఆమె కెరీర్ కి ఒక్కసారిగా బ్రేక్ పడినట్టయింది. ఈ దశలోనే ఐటెమ్ పాటతో అదరగొడితే తన స్టామినా ఏంటో తెలిసిపోతుందని గ్లామర్ తో కట్టిపడేయాలనేది కాజల్ ప్లాన్ గా తెలుస్తోంది.

,  ,  ,  ,  ,  ,  ,