Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Jun-2016 17:01:08
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున సినిమాలో అనుష్క.. ఇదేమీ పెద్ద విషయం అనిపించడం లేదిపుడు. ఎందుకంటే గత కొన్నేళ్లుగా అనుష్క కేరక్టర్.. నాగ్ కి ఓ సెంటిమెంట్ అయిపోయింది. అయితే తన సినిమాలో హీరోయిన్ గానో.. లేకపోతే ఓ గెస్ట్ కేరక్టర్ నో చేయిస్తున్నాడు నాగ్. ఇలా ఇప్పటికే రికార్డు సంఖ్యలో వీళ్లిద్దరి సినిమాలు వచ్చేశాయి. సూపర్ - డాన్ - రగడ - ఢమరుకం చిత్రాల్లో హీరోయిన్ కాగా.. కింగ్ - కేడి - సోగ్గాడే చిన్నినాయన - ఊపిరి చిత్రాల్లో గెస్ట్ రోల్స్ చేసేసింది స్వీటీ.

ఇప్పుడు హథీరాం బాబాగా నాగ్ నటిస్తున్న భక్తిరస చిత్రం ఓం నమో వెంకటేశాయలో కూడా అనుష్క నటిస్తోంది. అయితే.. అనుష్క కేరక్టర్ ఫైనల్ చేసేటప్పటికే.. ప్రగ్యా జైస్వాల్ ను మెయిన్ హీరోయిన్ గా తీసేసుకున్నారు. అలాగే స్వీటీ చేయనున్న భక్తురాలి రోల్ అనే విషయం కూడా లీక్ ఇచ్చారు. ఇప్పుడు తెలుస్తున్న లేటెస్ట్ సంగతి ఏంటంటే.. ఈ మూవీలో కూడా అనుష్క కేమియో మాత్రమే చేస్తోందట.

ఈ ఏడాదికి తన కాల్ షీట్స్ ఫుల్లుగా కేటాయించేసిన అనుష్క.. నాగ్- రాఘవేంద్రరావు మూవీలో అతిథి పాత్ర మాత్రమే అడగడంతో ఒప్పుకుందట. సినిమాలో ఒక ఎపిసోడ్ గా వచ్చే ఈ పాత్ర.. తెరపై కేవలం 10 నిమిషాలు మాత్రమే ఉంటుందని తెలుస్తోంది. అలాగే 2-3 రోజుల్లోనే అనుష్క రోల్ కి సంబంధించిన పిక్చరైజేషన్ కూడా పూర్తయిపోతుందట. మొత్తానికి అనుష్క భక్తి పంచేది 10 నిమిషాలు మాత్రమే. అందుకు ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోవాల్సిందే.

,  ,  ,  ,  ,  ,