Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Jan-2016 18:27:09
facebook Twitter Googleplus
Photo

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాట్ పేవరేట్ జంట క్రికెటర్ విరాట్ కోహ్లీ, నటి అనుష్క శర్మ ఎంతమేర ప్రేమలో మునిగిపోయారో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వీరిద్దరు ఒకర్నొకరు విడిచిపెట్టి వుండలేరన్నంతగా చట్టాపట్టాలేసుకుని తిరిగారు. రాత్రివేళ్లలో రెస్టారెంట్లకు వెళ్లడం, ఎవరికీ తెలియకుండా వీరిద్దరు షికార్లు చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేశాయి. కేవలం దేశంలోనే కాదు.. విదేశాల్లో కోహ్లీ పర్యటించిన సమయంలో అనుష్క అక్కడికి వాలిపోయేది. ఆమధ్య ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా కోహ్లీతోపాటు అనుష్క కూడా ఇంగ్లాండ్ కి వెళ్లడం పెద్ద దుమారాన్నే రేపింది. అప్పుడు ఈ జంటపై తీవ్రస్థాయిలో విమర్శలు వెలువడ్డాయి. అయినప్పటికీ ?ఎవరేమనుకున్న మనకేమీ? అనుకుంటూ ఈ జంట తన ప్రేమాయణాన్ని కొనసాగిస్తూ ముందుకెళ్లింది.

వీరిమీద ఎన్ని విమర్శలు వచ్చినా.. బహిరంగంగానే తమ ప్రేమను వ్యక్తపరుచుకుంటున్నారు. ఆమధ్య కోహ్లీ సెంచరీ కొట్టగానే ఆ మైదానంలో వున్న తన ప్రేమసి అనుష్కకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చేశాడు. ఇలా చేస్తే విమర్శలు వస్తాయని తెలిసి కూడా కావాలనే చేశాడు కోహ్లీ. ఏదేమైనా.. కోహ్లీ అలా చేయడం అప్పట్లో పెద్ద చర్చనే లేవదీసింది. తమ ప్రేమను కాస్తైనా సీక్రెట్ గా వుంచుకుంటే మంచిదని ఉచిత సలహాలు వారికి వచ్చినప్పటికీ.. ఆ జంట మాత్రం మారలేదు. ఇటీవల ఐపీఎల్ లో ఒక మ్యాచ్ సందర్భంగా అనుష్క నేరుగా కోహ్లీ దగ్గరకు వచ్చి అతనితో ముచ్చటించడం తీవ్ర దుమారాన్నే రేపింది. ఈ ఘటన క్రికెట్ చరిత్రలోనే పెద్ద సంచలనంగా నిలిచిపోయింది. అయినా.. వీరిలో ఏ మార్పు లేదు. ఆ మరుసటి రోజే రాయల్ ఛాలెంజర్ జట్టుకోసం ఏర్పాటు చేసిన బస్సులో కోహ్లీ పక్కనే అనుష్క కనువిందు చేసింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.. వీరి మధ్య ఎంత ఘాటు ప్రేమాయణం నడిచిందో.. వీరిద్దరు ఎంతగా తమ ప్రేమలో పీకల్లోతు మునిగిపోయారో!

ఇంతలా ప్రేమలో తడిసి ముద్దైన ఈ జట్ట.. ఇప్పుడు విడిపోయినట్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఎందుకంటే.. ఇంతకుముందులాగా వీరిద్దరూ ఎక్కువగా కలుసుకోవడం లేదు. గతకొన్నాళ్ల నుంచి కాస్త దూరంగానే వుంటున్నారు. బిజీ షెడ్యూల్ లో వున్నప్పుడు నిత్యం కలుసుకునే ఈ జంట.. ఇప్పుడు అంతగా బిజీ లేకపోయినప్పటికీ కలుసుకోవడం లేదు. పైగా.. మీడియాలో ఒకరి గురించి మరొకరు పెద్దగా చెప్పుకోవడం లేదు. వీరిమధ్య అనుకోకుండా బాగా గ్యాప్ పెరిగిపోయింది. చూస్తుంటే.. ఈ జంట ఎక్కువ రోజులు కలిసి వుండలేరని బాలీవుడ్ జనాలు సైతం చెప్పుకుంటున్నారు. వీరి మధ్య ఈ గ్యాప్ రావడానికి గల కారణాలు ఏంటి? ఎందుకు వీరు కలుసుకోవడం లేదు? అనే విషయాలు అంతు చిక్కడం లేదు కానీ.. ఈ గ్యాప్ చూస్తుంటే వీరు విడిపోయారేమోనన్న అనుమానాలు మాత్రం బలపడుతున్నాయి.

,  ,  ,