Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Sep-2017 11:38:18
facebook Twitter Googleplus
Photo

రెండు వారాలు గడిచినా అర్జున్ రెడ్డి సినిమాకు ప్రేక్షకాదరణ ఏ మాత్రం తగ్గలేదు. ఏరియాలతో సంబంధం లేకుండా అన్నిచోట్ల మంచి కలెక్షన్లే రాబడుతోంది. రిలీజయిన కొత్తలో ఈ సినిమాను కాంట్రవర్సీలు చుట్టుముట్టాయి. దీనికితోడు హీరో విజయ్ దేవరకొండ - హీరోయిన్ షాలినిల లిప్ కిస్ పోస్టర్లపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ ఓ రేంజిలో మండిపడ్డారు. అయితే కథనంలో ఉన్న ఇంటెన్సిటీ - లీడ్ క్యారెక్టర్లతో ప్రేక్షకులు కనెక్టవుతున్న తీరు ఈ సినిమాకు మంచి పేరు.. హిట్ టాక్ తెచ్చిపెట్టింది.

ఈ సినిమాకు తెలుగు ఇండస్ట్రీ నుంచి కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా ఈ సినిమా చూసిన హీరోయిన్ అనుష్క తన అభిప్రాయాన్ని ఫేస్ బుక్ లో షేర్ చేసింది. అర్జున్ రెడ్డి సినిమా తప్పకుండా చూడండి. నిజాయతీతో తీసిన చిత్రమిది. నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా - దర్శకుడు సందీప్ రెడ్డి వంగా - హీరో విజయ్ దేవరకొండ - హీరోయిన్ షాలినీతోపాటు మొత్తం యూనిట్ కు నా శుభాకాంక్షలు అంటూ పోస్ట్ షేర్ చేసింది. దాంతో పాటు తన పోస్టులో అర్జున్ రెడ్డి సినిమా పోస్టర్ కూడా యాడ్ చేసింది.

రిలీజయిన కొత్తలోనే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అర్జున్ రెడ్డి సినిమాను ప్రశంసించడంతో పాటు సినిమా టీంకు సపోర్టివ్ గా నిలిచాడు. హీరోయిన్లు సమంత - అను ఇమ్మానుయేల్ - మెహ్రీన్.. హీరోలు వరుణ్ తేజ్ - నాని - శర్వానంద్ ఈ సినిమా చాలా బాగుందంటూ ప్రశంసించారు. బాహుబలి దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి కూడా మంచి లవ్ స్టోరీ అంటూ అభినందించారు.

,  ,  ,  ,