Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Jun-2017 11:46:14
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ స్వీటీ అనుష్క.. గతంలో యోగ ఇన్ స్ట్రక్టర్ గా పని చేసింది. ఆమెకు ఫిట్నెస్ అంటే మహా ఇష్టం. టైం కలిసి రాక ఇప్పుడు బాగా లావయిపోయింది కానీ.. సహజంగా ఆమెకు తన దేహ సౌందర్యంపై మక్కువ ఎక్కువ. సైజ్ జీరో చిత్రం కోసం కమిట్మెంట్ తో పని చేయాలని భావించి.. స్వతహాగా లావయిపోయిన అనుష్క.. ఆ తర్వాత ఆ సైజులు తగ్గించుకోలేక ఇబ్బందులు పడుతోంది.

సైజ్ జీరో తర్వాత.. బాహుబలి2.. ఇప్పుడు భాగమతి.. మధ్యలో సింగం3.. ఓం నమో వెంకటేశాయ చిత్రాల కోసం దాదాపు గ్యాప్ లేకుండా వర్క్ చేసింది అనుష్క. సహజంగా సైజులు తగ్గించుకునేందుకు మధ్యలో చేసిన కొన్ని ప్రయత్నాలు వర్కవుట్ కాలేదు. దీంతో ఇప్పుడు మళ్లీ యోగపై ఫుల్ ఫోకస్ పెట్టేయాలని ఫిక్స్ అయిందట ఈ భామ. బాహుబలి దిం కంక్లూజన్ లో అనుష్క లావుగా కనిపించినా జనాలు బాగానే రిసీవ్ చేసుకున్నారు. అయితే.. ఈ విషయాన్ని అనుష్క మాత్రం సీరియస్ గానే తీసుకునేందని.. అర్జంటుగా కాకపోయినా.. తన కొలతలు తగ్గించుకోవాలని సీరియస్ డెసిషన్ తీసుకుందని తెలుస్తోంది.

మళ్లీ తన పాత రూపం తనకు రావాలంటే.. యోగనే సాధనం అని ఫిక్స్ అయిన అనుష్క శెట్టి.. అదే అంశంపై ఫోకస్ పెట్టనుందట. రోజూ కొన్ని గంటలపాటు యోగ సాధన చేయడం ద్వారా మళ్లీ తన పూర్వ రూపాన్ని పొందాలని చూస్తోందట.

,  ,  ,  ,  ,  ,