Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Nov-2017 12:58:24
facebook Twitter Googleplus
Photo

క్రేజ్ సృష్టించడంలో మహేష్ బాబు ఆరితేరిపోయాడు. తన తర్వాతి సినిమాకి దర్శకుడిని ఎంచుకోవడంలో ఆసక్తి కలిగించడంలో సూపర్ స్టార్ ని సూపర్ అనాల్సిందే. కాకపోతే ఫలితాలు కొన్నిసార్లు తేడా వచ్చినా.. ఇలాంటి క్రేజీ కాంబోలు మాత్రం ఆసక్తి కలిగిస్తుంటాయి.

ప్రస్తుతం కొరటాల శివతో భరత్ అనే నేను చిత్రంలో నటిస్తున్న మహేష్.. ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లోనే పూర్తి చేస్తున్నాడు. షెడ్యూల్ ప్రకారం అయితే మార్చ్ చివరి నాటికి ఈ మూవీ షూట్ పూర్తి కావాల్సి ఉంది. ఆ వెంటనే వంశీ పైడిపల్లితో సినిమాను లైన్ లో పెట్టిన మహేష్.. ఆ తర్వాతి ప్రాజెక్టులను ఇప్పటికే సెట్ చేసేశాడు. మైత్రీ మూవీస్ బ్యానర్ పై త్రివిక్రమ్ తో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇప్పుడు మరో స్టార్ డైరెక్టర్ తో మూవీకి సిద్ధమవుతున్నాడట మహేష్. ఖైదీ నంబర్ 150తో ఇండస్ట్రీ హిట్ కొట్టి.. ఇప్పుడు సాయి ధరం తేజ్ తో సినిమా చేస్తున్న మాస్ దర్శకుడు వివి వినాయక్ తో.. మహేష్ ఓ చిత్రానికి యాక్సెప్ట్ చేసినట్లు తెలుస్తోంది.

మహేష్ నుంచి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ వచ్చేయగా.. ఓ బడా నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇప్పటికే వినాయక్ కు అడ్వాన్స్ కూడా ఇచ్చేశారని.. మహేష్ తో మూవీ ఖాయంగానే ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.

,  ,  ,  ,  ,