Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Feb-2017 10:30:34
facebook Twitter Googleplus
Photo

బ్లాక్ బస్టర్ మూవీ రోబోకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న 2.0ను పూర్తి చేయడంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నారు. తాజాగా ఈ చిత్రం ఆఖరి షెడ్యూల్ షూటింగ్ కూడా మొదలైపోయింది. ఏరియల్ స్టంట్స్ తో యాక్షన్ సీక్వెన్స్ ను పిక్చరైజ్ చేస్తున్నాడు దర్శకుడు శంకర్. ఈ నెలాఖరుతో 2.0 షూటింగ్ పార్ట్ పూర్తయిపోనుంది. ఈ చిత్రం కోసం చాలా గ్రాఫిక్ వర్క్ చేయాల్సి ఉండడంతో.. దీపావళికి రిలీజ్ షెడ్యూల్ చేశారు.

మరోవైపు తన నెక్ట్స్ ప్రాజెక్టుకు ముహూర్తం పెట్టేసుకున్నారు రజినీకాంత్. కబాలి అంటూ మెమరబుల్ మూవీని అందిన పా రంజిత్ దర్శకత్వంలోనే.. రజినీ తర్వాతి చిత్రం చేయనున్నారు. ముంబై బ్యాక్ డ్రాప్ తో సాగే ఈ మూవీలో.. సూపర్ స్టార్ చేయబోతోన్న రోల్ చాలా వైవిధ్యంగా ఉంటుందని తెలుస్తోంది. మొత్తం సినిమాలో 60 శాతం ముంబైలోనే తీయనుండగా.. మిగిలిన భాగాన్ని ఇతర ప్రాంతాల్లోను.. చెన్నైలో సెట్స్ వేసి కంప్లీట్ చేయనున్నారు.

ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు స్కోప్ ఉండగా.. రెండు పాత్రలకు స్టార్ బ్యూటీస్ ని తీసుకునే యోచనలో ఉన్నాడట దర్శకుడు పా రంజిత్. ప్రస్తుతం స్క్రిప్ట్ కు తుది మెరుగులు దిద్దే పని జరుగుతుండగా.. మే నెలలో షూటింగ్ ప్రారంభించి.. నవంబర్ కల్లా పూర్తి చేయనున్నారట. 2018 సంక్రాంతికి రిలీజ్ టార్గెట్ చేస్తూ షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రానికి.. సూపర్ స్టార్ అల్లుడు ధనుష్ నిర్మాత

,  ,  ,  ,  ,  ,