Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-Jul-2015 13:33:39
facebook Twitter Googleplus
Photo

అనుష్కను చూడగానే సాంఘిక చిత్రాలకే కాదు, జానపద, చారిత్రక, పౌరాణిక పాత్రలకు తగిన రూపమని అనుకోని వారుండరు. 'బాహుబలి' .. 'రుద్రమదేవి' వంటి సినిమాల్లో ఆమెకి అవకాశం లభించడానికి ఆ రూపమే కారణం. అలాంటి అనుష్క కొంచెం సన్నగాను .. మరికాస్త లావుగాను తెరపై కనిపించనుంది. తెలుగులో 'సైజ్ జీరో' పేరుతోను .. తమిళ్లో 'ఇంజి ఇడుప్పళగి' పేరుతోను తెరకెక్కుతోన్న సినిమాలో ఆమె ఇలా కొత్తగా దర్శనమిస్తుంది.

తనకి ఇచ్చిన పాత్రకి న్యాయం చేయడానికి అనుష్క ఎంత కష్టమైనా పడుతుంది. అలాగే ఇప్పుడు ఈ సినిమా కోసం సన్నబడటానికీ .. లావు కావడానికి కూడా తనవంతు ప్రయత్నం చేసింది. సాధారణంగా ఇలాంటి ప్రయత్నాలు కథానాయకులు చేస్తారుగానీ, కథానాయికలు అంతధైర్యం చేయరు. ఎందుకంటే మరో సినిమాకి అది అడ్డుగా మారుతుంది. అలాంటి ఆలోచన పెట్టుకోకుండా అనుష్క ఈ రెండు పాత్రలను చేస్తుండటమే ఆమె ప్రత్యేకతగా చెబుతున్నారు. ఆల్రెడీ ఆమె సన్నగా కనిపించే దృశ్యాలను షూట్ చేశారు. ప్రస్తుతం ఆమె లావుగా కనిపించే సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

,  ,  ,