Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-Apr-2017 10:01:22
facebook Twitter Googleplus
Photo

బాహుబలి: ది కంక్లూజన్ సినిమా మీద అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇటు తెలంగాణ ప్రభుత్వం.. రెండూ కూడా అమితమైన ప్రేమ చూపించేశాయి. తెలంగాణ ప్రభుత్వం వారం రోజుల పాటు ప్రతి రోజూ అదనంగా ఓ షో వేసుకోవడానికి అనుమతిస్తే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసి ఏకంగా రెండు అదనపు షోలకు అనుమతి ఇచ్చేసింది. పెద్ద సినిమాలు రిలీజైనపుడు అనధికారికంగా తొలి రోజు వరకు ఐదారు షోలు వేయడం సహజమే. కానీ ఎన్నడూ లేని విధంగా వారం రోజుల పాటు అధికారికంగా రోజుకు ఆరు షోలు వేసుకోవడానికి అనుమతి ఇచ్చేసింది ఏపీ ప్రభుత్వం. ఒక అదనపు షో వరకు అనుమతి ఇవ్వడం ఓకే. కానీ ఉదయం ఆరు నుంచి అర్ధరాత్రి దాటాక కూడా షోలు నడిపించేలా ప్రభుత్వమే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వివాదాస్పదమవుతోంది. దీని వల్ల లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తుతుందేమో అన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.

ఐతే ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏమిటంటే.. ఏం చూసి ‘బాహుబలి-2’కు ఈ ప్రత్యేక అవకాశం కల్పించారు అని. ఇదేమీ మన చరిత్ర గురించి చెప్పే సినిమా కాదు. సమాజానికి ఒక సందేశాన్నిచ్చే సినిమా కూడా కాదు. ఇది పక్కా కమర్షియల్ సినిమా. ఆ చిత్రానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ ఇప్పటికే భారీగా లాభపడ్డారు. వాళ్ల కష్టానికి తగ్గ ఫలితం అందుకున్నారు. టికెట్ల కోసం డిమాండ్ ఎక్కువుంది కాబట్టి అదనపు షోలకు అనుమతి ఇచ్చామని సరిపుచ్చుకోవడానికి లేదు. మొత్తానికి ఒక క్రైటీరియా అంటూ ఏమీ లేకుండా రెండు ప్రభుత్వాలు అదనపు షోలకు అనుమతి ఇచ్చాయి. ఐతే భవిష్యత్తులో ఇలా అనుమతి అడిగిన వాళ్లందరికీ ఓకే అనేస్తే సమస్య ఏమీ ఉండదు.

,  ,  ,  ,  ,  ,  ,