Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Mar-2017 12:48:59
facebook Twitter Googleplus
Photo

ఇంట్లో సల్మాన్ ఖాన్ సూపర్ స్టార్ అయినప్పటికీ.. ఆయన తమ్ముళ్లు మాత్రం అస్సలు ఏ మాత్రం క్లిక్కవ్వలేదు. అటు పెద్దోడు అర్భాజ్ ఖాన్.. చిన్నోడు సొహైల్ కూడా ఏదో తూతుమంత్రంగానే సక్సెస్ అయ్యారు. నటులుగా.. నిర్మాతలుగా.. దర్శకులుగా.. ఎన్ని విధాలుగా ప్రయత్నించినప్పటికీ.. ఎందుకోగాని బ్రేక్ మాత్రం రానేరాలేదు.

అయితే అప్పట్లో జై చిరంజీవి సినిమాలో అర్భాజ్ ఖాన్ విలన్ గా నటించాడు. ఏకంగా మెగాస్టార్ సినిమాలో విలన్ గా చేసేశాడు అనుకుంటే.. ఆ తరువాత కూడా పెద్దగా బ్రేక్ వచ్చిందేం లేదు. ఇకపోతే ఇప్పుడు రాజ్ తరుణ్ హీరోగా వస్తున్న ''కిట్టు ఉన్నాడు జాగ్రత్త'' సినిమా ద్వారా మరోసారి తెలుగులో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఈ సినిమాలో విలన్ గా కనిపించనున్నాడు. అందుకే అనుకుంట.. జనాలకు ఒక వార్నింగ్ జారీ చేశాడు.

ఈరోజు కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమా రిలీజ్ అవుతోంది. మీ ఇంట్లోని పెట్స్ అన్నీ జాగ్రత్త అంటూ ఒక వీడియో పోస్టింగ్ పెట్టాడు అర్బాజ్ ఖాన్. మొత్తానికి తను ప్రమోషన్లకూ గట్రా రాకపోయినా కూడా.. రిలీజ్ రోజున ఇలా ఒక వీడియో పోస్టు పెట్టడం చాలా బాగుందనే చెప్పాలి.

,  ,  ,  ,  ,