Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Mar-2017 12:37:38
facebook Twitter Googleplus
Photo

అర్జున్ రెడ్డి టీజర్ ఇటీవలే విడుదలైంది. పూర్తిగా కొత్తగా, రెగ్యులర్ ఫార్మాట్ రూల్స్ ని బ్రేక్ చేస్తున్నట్టు ఉన్న ఈ టీజర్ అందరినీ చాలా గొప్పగా ఇంప్రెస్ చేసింది. ఏంతంటే ఇంతకు ముందు ఈ కథ విని వదులుకున్న హీరోలు టీజర్ చూసి దర్శకుడికి ఫోన్ చేసి మంచి కథను మిస్సయ్యాం అని చెప్పేంత. అంతలా ఆకట్టుకున్న ఈ టీజర్ మే నెలాఖరున రిలీజ్ కానున్న చిత్రంపై మంచి అంచనాల్ని బిల్డప్ చేసింది.
అంతేగాక చిత్ర సన్నిహిత సభ్యుల నుండి తెలుస్తున్న సమాచారం ప్రకారం ఎవడే సుబ్రహ్మణ్యం, పెళ్లి చూపులు చిత్రాల్లో కనిపించిన విజయ్ కు ఈ చిత్రంలో కనిపించబోయే విజయ్ కు చాలా తేడా ఉంటుందట. ఇప్పటి వరకు ఏ తెలుగు హీరో ట్రై చేయని సరికొత్త రకం పాత్రని విజయ్ చేశాడట. మంచి కథ కథనాలతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగనున్న ఈ సినిమా హీరోగా విజయ్ స్థాయిని ఇంకాస్త పెంచుతుందని కూడా అంటున్నారు. నూతన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో షాలిని, జియా శర్మలు హీరోయిన్లుగా నటిస్తుండగా ఒకప్పటి నటి కాంచన, వి.పి.యస్. కళ్యాణ్, సంజయ్ స్వరూప్, కమల్ కామ రాజ్ లు పలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

,  ,  ,  ,  ,