బాలీవుడ్ లో ఇప్పుడు బయోపిక్ ల కాలం నడుస్తోంది. మొన్నటికి మొన్న అమీర్ ఖాన్ నటించిన దంగల్ చిత్రం ఏకంగా రూ.400 కోట్ల కలెక్షన్లను సొంతం చేసుకొని ఇప్పుడున్న అత్యధిక కలెక్షన్ల రికార్డుల్ని బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే. భాగ్ మిల్కా భాగ్.. అజహర్.. ధోనీ ఇలా వచ్చిన బయోపిక్ లకు ప్రేక్షకుల ఆదరణ భారీగా ఉండటంతో.. ఆ దిశగా ప్రముఖుల లైఫ్ స్టోరీల్ని సినిమాలుగా తీసే ధోరణి ఈ మధ్యన ఎక్కువైంది.
ఇదే క్రమంలో లెజెండరీ.. క్రికెట్ దేవుడిగా కీర్తించే సచిన్ టెండూల్కర్ జీవితం మీద ఒక చిత్రాన్ని తీస్తున్నారు.