Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Oct-2015 15:13:28
facebook Twitter Googleplus
Photo

ఓ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ అంటే ఆ సినిమాకి సోల్ తెచ్చేవాడు అని అర్థం. ఇది టెక్నికల్ గా - ఫిజికల్ గా ఎంతో స్ర్టెస్ తో కూడుకున్న పని. ఈ రంగంలో దశాబ్ధ కాలంగా సేవలందిస్తూ దాదాపు 50 పైగా సినిమాలకు పనిచేశారు సీనియర్ ఆర్ట్ డైరెక్టర్ ఏ.ఎస్.ప్రకాష్. ఇక్కడ కెరీర్ ఆశించినంత గొప్పగా ఏం లేదు.. దీనికంటే పెళ్లిళ్లకు ఈవెంట్లకు వేదికలు నిర్మించడమే ఉత్తమం అని పలుమార్లు వాపోయిన ఆయన సినిమా వాసన వదల్లేక ఇక్కడినుంచి వెళ్లలేదని కన్ క్లూజన్ ఇచ్చారు. కెరీర్ గురించి ఆయన మననం చేసుకుంటూ ఇలా చెప్పారు.

వైజాగ్ లో ఫైన్ ఆర్ట్స్లో డిగ్రీ పూర్తిచేసి రామోజీ ఫిలింసిటీలో ఉద్యోగానికి చేరాను. అక్కడ సీనియర్ కళాదర్శకుడు నితీష్ రాయ్ వద్ద చేరాను. అతడి వద్ద చాలా కాలం పనిచేశా. ఆర్టిస్టుగా స్కెచ్ లు వేయడం నా పని. ఆ టైమ్ లోనే సుకుమార్ నా పనితనం చూసి ఆర్యకి పనిచేసే అవకాశం ఇచ్చారు. అలా ఆర్య చిత్రంతో కళా దర్శకుడినయ్యా. ఆరంభం ఉద్యోగం రిస్క్ చేసి సొంతంగానే కెరీర్ లో నిలబడగలిగాను. ఇప్పటికి 50పైగా సినిమాలకు పనిచేశానని ప్రకాష్ చెప్పారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు - మిర్చి - 100 పర్సంట్ లవ్ సినిమాలకు ఇల్లు సెట్ వేశాను. సీతమ్మ వాకిట్లో - అల్లుడు శ్రీను సెట్ లు చాలా కాస్ట్ లీ. వాటికి చాలా గొప్ప పేరొచ్చింది. శ్రీమంతుడు చూసి ప్రభాస్ ప్రశంసించారు. ఫలానా సెట్ బాగా వేశావంటూ పొగిడేశాడు. అది నిజంగా నా పనితనాన్ని మెచ్చుకోవడమే. అందుకు చాలా సంతోషంగా ఉంది... అంటూ వాస్తవాల్ని వివరించాడు ప్రకాష్.

ఆర్య - భద్ర - బొమ్మరిల్లు - కొత్త బంగారు లోకం .. ఇలా వరుసగా దిల్ రాజుతో సినిమాలకు పనిచేశాను. మహేష్ తో సీతమ్మ వాకిట్లో - దూకుడు - శ్రీమంతుడు సినిమాలకు పనిచేశా. అయితే శ్రీమంతుడు సెట్లు చూశాక ఎవరీయన? అని ప్రత్యేకించి అభినందించారు మహేష్. అది మర్చిపోలేనిది. ఇప్పుడు అఖిల్ సినిమా కోసం దక్షిణాఫ్రికా లాంటి భయానకమైన చోట గిరిజనుల సమక్షంలో సెట్స్ వేసి మెప్పు పొందడం ఆనందంగా ఉంది.. అని ప్రకాష్ తన కెరీర్ ని ముచ్చటించారు.

,  ,  ,  ,